All insults not offence under SC/ST Act: SC సాక్ష్యాలు లేకుంటే 'ఎస్సీ, ఎస్టీ చట్టం' వర్తించదు: సుప్రీంకోర్టు

Insulting remarks to scs sts within four walls not offence supreme court

Supreme Court, Scheduled castes, Scheduled tribes, abusing a SC/ST person, abusing with caste name, insult with caste name, casteist slur, SC/ST Act, offence under the SC/ST Act, insult, intimidation, SC, ST, SC/ST Act, Crime

Insulting remarks made to a person belonging to Scheduled Castes and the Scheduled Tribes within four walls of the house with no witnesses does not amount to offence, the Supreme Court said as it quashed the charges under the SC/ST Act against a man who had allegedly abused a woman within her building.

సాక్ష్యాలు లేకుంటే ‘‘ఎస్సీ, ఎస్టీ చట్టం’’ వర్తించదు: సుప్రీంకోర్టు

Posted: 11/06/2020 06:14 PM IST
Insulting remarks to scs sts within four walls not offence supreme court

నాలుగు గోడల మధ్య షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులను దూషించారనే ఆరోపణలను నేరంగా పరిగణించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరిచింది, ఇక ఇలా దూషించిన అరోపణలకు బలమైన సాక్ష్యాలు లేని పక్షంలోనూ దాన్ని నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఓ వ్యక్తి తనను నాలుగు గోడల మధ్య దూషించాడని పిర్యాదు చేసిన ఓ ఎస్సీ మహిళ కేసును న్యాయస్థానం రద్దు చేసింది, ఈ కేసు విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగిలతో కూడిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఉన్నత వర్గాలకు చెందిన ఓ వ్యక్తి తనను వేధించారంటూ ఎస్సీ/ఎస్టీ చట్టం కింద బాధిత మహిళ కేసు పెట్టగా, అది అత్యున్నత ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. బాధితురాలు ఎస్సీ లేదా ఎస్టీ అయినంత మాత్రాన అన్ని రకాల వివాదాలు, అవమానాలను అదే చట్టం కింద విచారించలేమని ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. సభ్యసమాజంలో ప్రజల ఎదుట, జనసామర్థ్యం వున్న ప్రాంతాల్లో ఈ కులాలు, తెగలకు చెందిన వ్యక్తులను ఎవరైనా కులం పేరుతో దూషణలకు పాల్పడినా.. అవమానించిన సందర్బాల్లో మాత్రమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలు వర్తిస్తాయని, అలాంటి కేసుల్లోనే ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొనింది.

ఈ కేసులో నిందితుడిపై ఎస్టీ చట్టం 1989, సెక్షన్ 3(1) కింద పెట్టిన కేసు చెల్లదని ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే ఇదే నేరం నాలుగు గోడల మధ్య కాకుండా బయటి ప్రాంతాల్లో, లేక తోట వంటి ప్రదేశాల్లో నలుగురూ చూసేలా ఉన్న చోట లేదా బయటి నుంచి కనిపిస్తూ, వినిపిస్తూ ఉన్న ప్రాంతంలో జరిగితే దాన్ని నేరంగా పరిగణించవచ్చనపి తెలిపింది. కానీ, ఈ కేసు ఎఫ్ఐఆర్ లో మహిళను నాలుగ్గోడల మధ్య తిట్టినట్టుగా ఉందని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరని దీంతో నేరంగా పరిగణించేందుకు వీల్లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే నాలుగు గోడల మధ్య దూషణలు.. అవమానాలు సాక్షాలు లేని కారణంగానే పరిగణలోకి తీసుకోబడవని న్యాయస్థానం పేర్కోందిజ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Scheduled castes  Scheduled tribes  SC  ST  SC/ST Act  Crime  

Other Articles