BJP means Bharatiya jhuta party: Harish Rao బీజేపి అంటే భారతీయ ఝూఠా పార్టీ.. హరీశ్ రావు

Dubbaka by poll bjp means bharatiya jhuta party alleges minister harish rao

Dubbaka bypoll, CM KCR, victory in by-poll, Harish Rao, Finance Minister, Bharatiya Jhuta party opposition parties, BJP President, Bandi Sanjay, Raghunandhan Rao, Telangana, politics

Telangana Finance Minister Harish Rao today alleges that it is noting all the lies which are being propaganding against TRS in the Dubbaka by-election. He said according to the lies Bharatiya Jhuta party suits the BJP.

దుబ్బాక ఉపఎన్నిక: బీజేపి అంటే భారతీయ ఝూఠా పార్టీ.. హరీశ్ రావు

Posted: 10/30/2020 11:51 PM IST
Dubbaka by poll bjp means bharatiya jhuta party alleges minister harish rao

(Image source from: Twitter.com/trspartyonline)

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారపర్వానికి మరో రెండురోజుల్లో తెరపడనున్న తరుణంలో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీజేపి, టీఆర్ఎస్ ల మధ్య విమర్శలు, అరోపణల పర్వం శృతిమించిపోతోంది. అధికార టీఆర్ఎస్.. దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అకస్మిక మృతితో ఉప ఎన్నికలు వచ్చిన ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మూడు పార్టీలు సవాల్ గా తీసుకోగా.. రెండు అధికార పార్టీల మధ్య మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా వున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు తమకు ఎప్పుడో ఖాయమైందని అయితే మోజారీటీ కోసమే ప్రస్తుతం తమ ఆరాటమంతా అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీ తరఫున తమ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. శిశుపాలుడి వంద తప్పులను శ్రీకృష్ణుడు లెక్కించినట్టు తాను బీజేపీ అబద్ధాలను లెక్కపెడుతున్నానని అన్నారు. బీజేపీ ఆడుతున్న అబద్ధాలను చూస్తుంటే శతసహ్రస అబద్దాలు ఆడైనా విజయాన్ని అందుకోవాలన్న ఆరాటమే కనిపిస్తుంది కానీ.. నిజంగా ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం అస్సలు దృష్టి పెట్టలేదని అన్నారు. బోర్ల సాయంతోనే తడిసే తెలంగాణలో బీజేపి అమర్చే మీటర్లు తిరగనిదే చుక్క నీరు రాదు.. సెంటు భూమి కూడా తడవదని అన్నారు.

ఇన్ని అబద్దాలను అవలీలగా అడుతున్న బీజేపీ భారతీయ జనతా పార్టీ అని కాకుండా భారతీయ ఝూటా పార్టీ (అబద్ధాల పార్టీ) అని పిలవాల్సి వస్తోందని వ్యంగ్యోక్తులు విసిరారు. బీజేపీ రాష్ట్ర నేతలు మొదలుకుని ఆ పార్టీ కార్యకర్తల వరకు ఒక్కరైనా నిజాలు మాట్లాడడంలేదని విమర్శించారు. సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని విస్మరించారని, అసత్యమేవ జయతే అనే సూక్తిని నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అంశాలను ఉదాహరించారు.

దుబ్బాకలో పాలిటెక్నిక్ కాలేజీని సిద్ధిపేటకు తీసుకెళ్లామని అరోపించిన బీజేపి నేతలు శంకుస్థాపన ఎక్కడ జరిగిందో కూడా చూపించాలని డిమాండ్ చేశారు. చేగుంటకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు కాగా... దాన్ని గజ్వేల్ తరలించారని.. దానికి రూ.25 కోట్ల నిదులు కూడా మంజూరయ్యాయని అరోపిస్తున్నారని అన్నారు. అసుపత్రి మంజూరుకు సంబంధించిన ఉత్తర్వుల కాగితం చూపిస్తారా? అని నిలదీశారు. విద్యుత్ నూతన ముసాయిదా చట్టం తెచ్చిన కేంద్రాన్ని తాము వ్యతిరేకిస్తున్న విషయాన్ని పక్కనబెట్టి కేసీఆర్ మీటర్లు పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు తూర్పారబట్టారు. 

మరే రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు రూ.2,016 ఫించణు ఇస్తున్నా దానిని కూడా రాజకీయం చేయడం బీజేపికే చెల్లిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు, బీడీ కార్మికులకు ఫించనులో రూ.1,600 కేంద్రం ఇస్తోందని తప్పుడు ప్రచారాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు రేషన్ బియ్యం వ్యవహారంలోనూ కేంద్రం రూ.29 ఇస్తే, రాష్ట్రం రూ.1 మాత్రమే ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే.... రేషన్ బియ్యం అంశంలో సగం మాత్రమే కేంద్రం నుంచి వస్తుంది. మిగతా సగం రాష్ట్ర సర్కారు భరిస్తుందని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కోనుగోళ్లకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కొనుగోళ్లు చేసిందని హరీశ్ రావు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles