'Chicken dinner' is over as PUBG Mobile stops access పజ్బీ గేమర్స్ కు చేదు వార్త.. ఇక ఆటను ఆడలేరుగా..!

Pubg mobile to stop working in india from today company issues official statement

India, PUBG Mobile, PUBG Ban, Player Unknown Battle Ground, Chinese apps, PUBG, Pubg Mobile Lite, Google Play Store, Pubg Ban News, Tencent Games

Sad news for PUBG fans! It's time to say goodbye to PlayerUnknown's Battlegrounds aka PUBG in India. Both PUBG Mobile and PUBG Mobile Lite, which were banned on September 2 by the Indian government over security concerns, will no longer work in the country.

పజ్బీ గేమర్స్ కు చేదు వార్త.. ఇక ఆటను ఆడలేరుగా..!

Posted: 10/30/2020 11:30 PM IST
Pubg mobile to stop working in india from today company issues official statement

(Image source from: tamil.samayam.com)

పబ్జీ ఈ మాయదారి ఆన్ టైన్ ఆట దేశవ్యాప్తంగా ఎంతోమంది యువత ప్రాణాలను బలిగొనింది. అయినా ప్రత్యర్థి జట్టుపై తాము విజయం సాధించేందుకు ఎందరో యువత తమ అమూల్యమైన సమయాన్ని చైనా నుంచి వచ్చిన ఈ పబ్జీ ఆట కోసం వినియోగిస్తున్నారే తప్ప.. తమ పార్యపుస్తకాలపై మత్రం శ్రద్దచూపడం లేదు. ఎందరో జీవితాలను ఈ ఆన్ లైన్ ఆట నాశనం చేస్తోంది. భవిష్యత్ గురించి కనే బంగారు కలలను సార్థకం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల అభిమతాన్ని కాదనలేక వేల రూపాయలను వచ్చింది వారికి మోబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు కొనిస్తు్న్నారు.

అయితే ఇన్నాళ్లకు వారి ప్రార్థనలను దేవుడు ఆలకించాడో ఏమో తెలియదు కానీ.. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి దిగుమతైన పబ్జీ గేమ్ ను మాత్రం నిషేధించాడు. అయినా ఇప్పటికే తమ సెల్ ఫోన్లలో డౌన్ లోడ్ అయిన ఈ ఆటను అడేస్తున్నారు కొందరు. అయితే వారికి ఇది పూర్తిగా మింగుడు పడని వార్తే. ఇక నుంచి ఈ ఆటను ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఆడే అవకాశం ఉండదు. భారత ప్రభుత్వం నిషేధం విధించిన దాదాపు రెండు నెలల తర్వాత పబ్జీ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది.

పబ్జీ సహా 116 మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం సెప్టెంబరులో నిషేధం విధించగా.. అదే  నెల 2 నుంచి పబ్జీ కొత్త డౌన్‌లోడ్లు నిలిచిపోయాయి. అయితే బ్యాన్ కు ముందే డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఆట ఆడే అవకాశం లభించింది. తాజాగా సర్వర్లను నిలిపివేయడంతో ఇకపై వారు కూడా ఈ ఆటను ఆడలేరు, ఈ మేరకు పబ్జీ మొబైల్‌ ఫేస్ బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు అక్టోబరు 30 నుంచి భారత యూజర్లకు సర్వీసులను నిలిపివేసింది. ఇకనైనా ఆన్ లైన్ ఆటల వేటలో పడి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తుపై కన్న కలలను సాకారం చేసుకుంటే మంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PUBG  Player Unknown Battle Ground  PUBG banned  PUBG in india  PUBG game  

Other Articles