SC Slams Police For Misusing Law Over Social Media Posts సోషల్ మీడియాలో పోస్టులపై నోటీసులు.. సుప్రీం సీరియస్

Telangana is turning out to be a hub for electric vehicles ktr

kt rama rao, k t rama rao, KTR, chief minister, kt rama rao electic vehicles, telangana electric vehicles hub, electric vehicles promotion, no road tax for electric vehicles, no gst for electric vehicles, muncipal administration and urban development, electric vehicles, it minister kt rama rao, telangana

Minister KT Rama Rao stated that Telangana is turning out to be a hub for electric vehicles promotion and storage of oil resources. The new state policy of electric vehicles is being successful in about 1000 acres near city to give better results to check future pollution, he said

ఎలక్ట్రికల్ వాహనాలకు తెలంగాణ కేంద్రంగా మారుతోంది: కేటీఆర్

Posted: 10/31/2020 12:11 AM IST
Telangana is turning out to be a hub for electric vehicles ktr

(Image source from: Twitter.com/KTRTRS)

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగడంతో కాలుష్య సమస్యకు కొంతవరకు చెక్ పెట్టవచ్చునని, దీంతో పాటు ఇంధన నిల్వలను భవిష్యతరాలకు నిల్వ చేసుకునే వెసలుబాటు కూడా కలుగుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అద్భుత విజయాన్ని అందుకోనుందని, తద్వారా తెలంగాణ ఈ వాహనాలకు హబ్ గా మారబోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు, ఇందుకు అనువైన నూతన విధానాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల శిఖరాగ్ర సదస్సులో మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ విడుదల చేశారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సులో చర్చించిన ఆయన ఈ ఎలక్ట్రికల్ వాహనాల కోనగోళ్లుకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ధరల పరంగా ఎక్కువ ఆసక్తిని కనబర్చని కస్టమర్లు ఇక ఇవి అందుబాటు ధరలోనే సమకూరడంతో ఆసక్తి కనబర్చే అవకాశాలు వున్నాయి. ఇక ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి పదేళ్ల వరకు రోడ్ టాక్స్ నుంచి మినహాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు నుంచి కూడా మినహాయింపు కల్పించేవిధంగా నూతన ఎలక్ట్రికల్ వాహనాల విధానం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలకు కూడా భారీ రాయితీలను ప్రకటించింది,  

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని అన్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో భూములు అందుబాటులో ఉన్నాయని.. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌ కాంత్‌ లు వీడియో కాన్షరెన్స్ ద్వారా సదస్సులో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Electric vehicles  Raod Tax  GST  Telangana Hub  Manufacturing units  spare parts units  Telangana  

Other Articles