Slipper thrown at Nitish Kumar at public meeting నితిశ్ కుమార్ కు అవమానం.. చెప్పు విసిరిన అగంతకులు

Slipper flung towards nitish kumar at bihars muzaffarpur rally 3 arrested

Tejashwi Yadav, Chief Minister Nitish Kumar, slipper thrown, protestors, helicopter, election meeting, BJP JDU coalition, Muzaffarpur, Bihar, Politics

A slipper was flung towards Chief Minister Nitish Kumar by some protestors while he was going towards his helicopter after completing speech at an election meeting in Sakra in Muzaffarpur district, but it missed the target.

బహిరంగసభలో నితిశ్ కుమార్ కు అవమానం.. చెప్పు విసిరిన అగంతకులు

Posted: 10/27/2020 10:24 PM IST
Slipper flung towards nitish kumar at bihars muzaffarpur rally 3 arrested

గత మూడు పర్యాయాలుగా బీహార్ పై తనదైన ముద్రవేసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఈ పర్యాయం ఎన్నికలలో కాసింత వ్యతిరేక గాలి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఆయన ఏ జిల్లాలో పర్యటించినా.. ఎక్కడికి వెళ్లి బహిరంగ సభల్లో పాల్గోంటున్నా.. ఆయనను ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలు తమ గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా తన శాంతిస్వభావాన్ని కోల్పోయి.. మీరు నాకు ఓటు వెయ్యకపోతే  వచ్చే నష్టమేమీ లేదు.. అంటూ ఓటర్లపై కూడా రుసరుసలాడిన ఘటనలు ఈ ధఫా బీహార్ ఎన్నికలలో మనం చూస్తున్నాం. అయితే నలుగురు వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరడం కలకలం రేపింది.

ముజాఫర్పూర్ లోని సాక్రా లో ఆయన బహిరంగ సభను ముగించుకుని తన హెలికాప్టర్ ఎక్కేందుకు నడిచి వెళ్తుండగా అక్కడే వున్న నలుగురు వ్యక్తులు హెలికాప్టర్ పైకి చెప్పులు విసిరారు, అయితే అది ఆయనకు దూరంలో పడటంతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇందుకు కారణమైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇంతటి వ్యతిరేకతను ఆయన మూటగట్టుకోవడానికి ముఖ్యకారణం ఏంటంటే మహాఘట్ బంధన్ కు పార్టీలు ఆయనకు అందలం అందించినా ఆయన వెన్నుపోటు పొడవమే. అంతేకాదు మూడు పర్యాయాలుగా ఆయనే పీఠంపై కోనసాగుతున్న తరుణంలో వ్యతిరేకత కూడా వుండటం సహజం.

గత పర్యాయం కాంగ్రెస్, ఆర్జేడీలతో కలసి మహాఘట్బంధన్ గా ఏర్పడి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్ కుమార్.. ఆ తరువాత వేగంగా ప్లేటు పిరాయించి బీజేపితో చేతులు కలపి అధికారంలోకి తీసుకువచ్చిన కాంగ్రెస్, ఆర్జేడీలను నిట్టనిలువునా ముంచేసాడు. అంతేకాదు ఆ తరువాత వెనువెంటనే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడం కూడా బీహార్ ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. ఈ పరిణమాల నేపథ్యంలో సీఎం నితీశ్ ఎక్కడికి వెళ్లినా అయన పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలలో విజయం సాధిస్తారా.. లేదా అన్నది పక్కనబెడితే ఎన్నడూ లేని విధంగా ఆయన పట్లు ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు,

బీహార్ లో ఓటర్లు తమ తీర్పును వెలువరించే సమయానికి ఇంతలా వ్యతిరేకత వ్యక్తం కావడం.. పర్యటనల్లో పరాభవం ఎదురుకావడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఆయన కొన్నిసార్లు నిగ్రహాన్ని కోల్పోయి నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ ర్యాలీలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు అనుకూలంగా కొందరు నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘ఏమిటీ నాన్సెన్స్’ అంటూ కోపంతో ఊగిపోయారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు తనకు ఓటు వేయకపోయినా బాధపడనని.. కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని నితీశ్‌ కుమార్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles