SC directs Allahabad HC to monitor Hathras case హత్రాస్ కేసు విచారణ హైకోర్టు పర్యవేక్షించండీ: సుప్రీం అదేశాలు

Hathras case sc directs allahabad high court to monitor cbi probe

Hathras gang rape case, Allahabad high court, Chief Justice SA Bobde, CBI probe in Hathras case, Central Bureau of Investigation, Uttat Pradesh, Crime

The Allahabad High Court will monitor all aspects including the CBI investigation into the alleged gang-rape and death of a Dalit girl from Uttar Pradesh's Hathras, the Supreme Court said today. The top court said that a request to transfer the trial out of UP 'has been left open' until the investigation is completed.

హత్రాస్ కేసు విచారణ హైకోర్టు పర్యవేక్షించండీ: అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం అదేశాలు

Posted: 10/27/2020 11:15 PM IST
Hathras case sc directs allahabad high court to monitor cbi probe

(Image source from: Hindustantimes.com)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాత్రాస్‌ సామూహిక అత్యాచార, హత్య కేసు ఘటనపై ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు అదేశించిన విషయం తెలిసిందే. కాగా ఈ దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో రోజువారీగా కేసు వివరాలను ప్రస్తుతానికి అలహాబాద్‌ హైకోర్టే పర్యవేక్షిస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర కోణాలను సైతం హైకోర్టే చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షుల భద్రతను కూడా హైకోర్టే పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. కేసు విచారణను ఉత్తర్‌ప్రవేశ్‌ వెలుపల దిల్లీలోని ఓ కోర్టులో జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, సీబీఐ విచారణపైనా తమకు నమ్మకం లేదని.. ఈ కేసును సుప్రీంకోర్టే స్వీకరించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను పర్యవేక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఉత్తర్‌ ప్రదేశ్ లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీంతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles