15 Tution children effected with covid-19 in Guntur ట్యూషన్ కు వెళ్లిన 15 మంది చిన్నారులకు కరోనా.!

15 tution children effected with coronavirus in sattenapalle of guntur

tution center, school children, tution children, online classes, coronavirus, covid-19, sattenapalle, Guntur, Andhra Pradesh, crime

The schools conducting online classes gives a boast to teachers for tutions, a teacher who had not taken precautionary measures effected 15 Tution children effected with coronavirus in sattenapalle of Guntur.

ట్యూషన్ కు వెళ్లిన 15 మంది చిన్నారులకు కరోనా.!

Posted: 10/04/2020 02:17 AM IST
15 tution children effected with coronavirus in sattenapalle of guntur

కరోనా వైరస్ రేపిన కల్లోలంతో గత విద్యా సంవత్సరం ముగింపులో అర్థాంతరంగా పాఠశాలలకు తాళాలు పడ్డాయి. ఇక ఈ విద్యాసంవత్సరం కూడా ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. అయితే విద్యాసంస్థలు మాత్రం ఆన్ లైన్ పాఠశాలలు ప్రారంభించాయి. ఇక ఇప్పటికే పలు పాఠశాలలు హాఫ్ ఇయర్లీ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విద్యాసంవత్సరం గురించి కొంత కంగారుపడుతున్నారు, విద్యాలయాలకు వెళ్తే వారికి నేరుగా ఉపాధ్యాయులతో కలసి సందేహాలు వుంటూ తీర్చుకునే వెసలుబాటు వుంటుంది. కానీ ఆన్ లైన్ పాఠాల నేపథ్యంలో వారు ఎలా చదువుతున్నారో కూడా తల్లిదండ్రులకు అర్థం కాలేదు.

దీంతో వారు తమ పిల్లలను ట్యూషన్ సెంటర్లకు పంపుతున్నారు, గత ఆరు నెలలుగా ఇంట్లో ఆడుకున్నది చాలు ముందు చదవండీ అంటూ వారిని ట్యూషన్లకు పంపుతున్నారు. అయితే ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తున్నారా లేదా.? అన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా పిల్లలను పంపుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఈ ట్యూషన్ కేంద్రంలోని ఏకంగా 15 మంది పిల్లలు కరోనా బారిన పడేందుకు కారణమైంది. దీంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి వాసులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

భట్లూరులో ఓ ప్రైవేటు టీచర్ పిల్లలకు ట్యూషన్ చెబుతోంది. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాల్సిన టీచర్ వాటికి తిలోదకాలు ఇచ్చి తనకు కరోనా సోకినా.. అది నిర్థారణ అయ్యేందుకు పట్టే సమయంలో విద్యార్థులకు ట్యూషన్ చెప్పింది. దీంతో అమె వద్దకు ట్యూషన్ వచ్చే 15 మంది విద్యార్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అయితే అనారోగ్యం బారిన పడిన టీచర్ కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, అమెకు కరోనా అని తేలింది. దీంతో కాంటాక్టు కేసుల జాబితా నేపథ్యంలో ట్యూషన్ కు వెళ్లిన చిన్నారులకు కూడా పరీక్షలు నిర్వహించారు. ట్యూషన్ వచ్చేవారిలో 15 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని తేలింది.

వైరస్ బారిన పడిన చిన్నారులంతా ఏడేళ్లలోపు వయసున్న చిన్నారులే కావడం కలకలం రేపుతోంది. అంతటితో ఆగని కాంటాక్టు కేసుల జాబితా చిన్నారులతో వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు కూడా చేరింది, దీంతో భట్లూరులో తీవ్ర ఆందోళన రేకెత్తింది. ఈ క్రమంలో జిల్లా వైద్య అధికారులు అప్రమత్తయ్యారు, కరోనా సోకిన కుటుంబాలను ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. మొత్తంగా గ్రామంలో 39 కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు అధికారులు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి చిన్నారులను అప్పుడే ట్యూషన్ సెంటర్లకు పంపకూడదని, వారిని ఇంట్లోనే చదువుకునేలా తల్లిదండ్రులు చూసుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles