Nation wants justice for India’s daughter: Rahul Gandhi 'జాతి హాత్రాస్ ఆడబిడ్డకు న్యాయం కావాలంటోంది'

Gandhis meet hathras family amid protests clash with up cops

Hathras, Rahul Gandhi, priyanka gandhi, Hathras gangrape, Uttar Pradesh, UP Police, Hathras Rape Case, Hathras Rape, Rahul Gandhi pushing image, rahul gandhi picture, priyanka gandhi picture, Hathras Rape Case, Hathras Rape Case News, Hathras Gang Rape News, Greater Noida, Yamuna Express Highway, Uttar pradesh, Politics

Congress leader Rahul Gandhi on Saturday visited Hathras gang-rape victim's family and said the whole country was united in seeking justice for the daughter of India. He tweeted hours after meeting the family members of the 19-year-old Dalit woman who was gang-raped in Uttar Pradesh's Hathras by 'upper' caste men on September 14.

జాతి హాత్రాస్ ఆడబిడ్డకు న్యాయం కావాలంటోంది: రాహుల్ గాంధీ

Posted: 10/04/2020 02:04 AM IST
Gandhis meet hathras family amid protests clash with up cops

ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ బాధిత దళిత యువతి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు పరామర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు బృంధం బూల్ గదికి బాధిత కుటుంబాన్ని కలిసి వారికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఘటన గురించి ఆతదనంతరం చోటుచేసుకున్న పరిణామాల గురించి బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. రాహుల్, ప్రియాంకలు రాక గురించి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుుల కూడా బూల్ గదికి చేరకున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ వెలుపలకు చేరుకున్నారు.

అయితే కార్యకర్తలను పోలీసులు గ్రామంలోని రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య గ్రామంలోని ప్రవేశించిన కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబానికి చేరుకున్నారు. హాత్రాస్ అత్యాచార బాధిత కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని రాహుల్ వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రియాంక గాంధీ పేర్కోన్నారు. పోలీసులతో గొడవ పడిన అనంతరం రాహుల్ గాంధీ బృందం బూల్ గదికి చేరకుంది. పోలీసులు ఇవాళ మరోమారు తమ కార్యకర్తలపై లాఠీచార్జీకి పాల్పడ్డారు. దీంతో తెగువ చూపిన ప్రియాంక గాంధీ తమ కార్యకర్తపై పోలీసు లాఠీ దెబ్బ పడకుండా అడ్డుగా వెళ్లారు.

ఉత్తర్ ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది. డీఎన్డీ ఫ్లైవేపై కొనసాగిన హైడ్రామాలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రాహుల్, ప్రియాంకా గాంధీలు గురువారం యమునా హైవేపై అడ్డుకున్న పోలీసులు రాహుల్ ను విఛక్షణా రహితంగా తోసివేయడంతో ఆయన కిందపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ కు బయలుదేరిన గాంధీ కుటుంబ సభ్యులను డీఎన్డీ వద్ద ఇవాళ మరోమారు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీఛార్జికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ ప్రతిఘటించారు. ఓ కార్యకర్తను లాఠీఛార్జీ నుంచి తప్పించేందుకు స్వయంగా తానే తోపులాటలోకి వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలతో పంచుకుంది, న్యాయం కోసం చేసే పోరాటంలో తాము ఎంతటి కష్ణాలనైనా ఎదుర్కొంటామని ట్వీట్ చేసింది. ఇక ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు దేశంలోని ఏ శక్తి తనను హాత్రాస్ బాధిత కుటుంబాన్ని కలవకుండా వారి అవేదనను వినకుండా అపలేదని ఢిల్లీ నుంచి హాత్రాస్ బయలు దేరి ముందు రాహుల్ గాంధీ అన్నారు. ఇక ఢిల్లీకి చేరకున్న తరువాత రాహుల్ గాంధీ.. భారత జాతి తన ఆడబిడ్డకు న్యాయం కావాలని అడుగుతొందని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles