Kwality ex-promoter booked in Rs 1,400 crore ఐస్ క్రీం కంపెనీ మాజీ ప్రమోటర్ పై ఎగవేతదారు కేసు

Dairy firm kwality ex promoter booked in rs 1400 crore bank fraud case

Sanjay Dhingra, ex-promoter, Kwality Ltd, banks, Bank of India, Central Bureau of Investigation CBI, CRORES, ice cream company, milk products company, bank fraud case

The Central Bureau of Investigation (CBI) has registered a case against Delhi-based private sector dairy company Kwality Ltd, its ex-promoters Sanjay Dhingra and other executives of the company on a complaint from Bank of India for causing an alleged loss of Rs 1,400.62 crore to a consortium of banks led by the lender.

ఐస్ క్రీం కంపెనీ మాజీ ప్రమోటర్ పై ఎగవేతదారు కేసు

Posted: 10/04/2020 02:33 AM IST
Dairy firm kwality ex promoter booked in rs 1400 crore bank fraud case

అత్యంత ప్రజాదారణ పొందిన ఐస్ క్రీమ్ తయారీ, పాల ఉత్పత్తుల కంపెనీ క్వాలిటీ లిమిటెడ్ మాజీ ప్రమోటర్ బ్యాంకులకు టోపి పెట్టారు. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలను పోందిన ఆయన ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగవేసేందుకు కుట్ర చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడింది. తప్పుడు లెక్కలు చూపించి కోట్లలో రుణాలు పొందాయని గుర్తించారు. ఈ మేరకు కంపెనీకి చెందిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. విచారణలో క్వాలిటీ లిమిటెడ్ చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. క్వాలిటీ లిమిటెడ్ భారత్ బ్యాంకుల్లో రూ.1400 కోట్ల వరకు రుణాన్ని పొందింది.

కంపెనీకి సంబంధించిన తప్పుడు పత్రాలను బ్యాంకుకు సమర్పించి కోట్లలో రుణాన్ని పొందింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కంపెనీకి చెందిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. బ్యాంకు రుణాలు చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ స్కాంలో క్వాలిటీ లిమిటెడ్ డైరెక్టర్లు సంజరు ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ్ భాగస్వాములుగా కొనసాగుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 10 బ్యాంకుల నుంచి క్వాలిటి లిమిటెడ్ రుణాన్ని పొందింది. అయితే బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం చెల్లించడం లేదని 2018 ఆగస్టులో క్వాలిటీ లిమిటెడ్ ఖాతాను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారు.

బ్యాంక్ అప్ బరోడా ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ కొనసాగించింది. ఈ మేరకు విచారణలో క్వాలిటీ కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.13,147.25 కోట్లుగా చూపింది. ఇందులో రూ.7,107.23 కోట్లు మాత్రమే బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ ను సీబీఐకి సమర్పించింది. రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసి క్వాలిటీ లిమిటెడ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినట్లు బ్యాంక్ ఆప్ ఇండియా ఆరోపించింది. 2018 చివరి నాటికి క్వాలిటీ చాలా బ్యాంకుల నుంచి దాదాపు రూ.1900 కోట్లు అప్పు తీసుకుంది. ఇందులో రూ.520 కోట్లు చెల్లించింది. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ కంపెనీపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles