Uma Bharati: End siege of Hathras victim's family యూపీలో కొనసాగుతున్నది రామరాజ్యమా.? పోలీసు రాజ్యమా.?

Polices suspicious actions in hathras case dented image of bjp up govt uma bharti

uma bharati, hathras gangrape case, bjp uma bharati, uma bharati yogi adityanath, UP Police, SIT, Uttar Pradesh, Politics

Senior BJP leader Uma Bharti questioned the 'suspicious' action of police in Hathras, and said the incident had 'dented' the image of CM Yogi, the UP government, and the BJP. Bharti told Adityanath she was not aware of any rule under which the Dalit family could be prevented from meeting anyone, and asked him to allow the media and members of other political parties to meet them.

ఇది రామరాజ్యమా.? పోలీసు రాజ్యమా.?: సీఎం యోగీకి ఉమాభారతి కౌంటర్

Posted: 10/03/2020 06:23 PM IST
Polices suspicious actions in hathras case dented image of bjp up govt uma bharti

ఉత్తర్ ప్రదేశ్ లో రామ మందిర నిర్మాణానికి శంఖుస్థాపన చేసి.. దేశమంతా రామరాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చిన బీజేపికి అదే ప్రశ్నను కౌంటర్ గా వేసి ఇరకాటంలోకి నెట్టింది బీజేపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభహారతి, రాష్ట్ర పోలీసుల ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో రామరాజ్యం పాలన నడుస్తోందా.? లేక పోలీసు రాజ్య పాలన కోనసాగుతోందా.? అంటూ సొంత పార్టీపైనే అమె రుసరుసలాడింది. హత్రాస్ ఘటనపై పోలీసులకు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఇక్కడి పోలీసుల ప్రవర్తనా తీరు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపి పార్టీని కూడా అపఖ్యాతి పాలు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

హత్రాస్ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిన అసుపత్రిలో మృతిచెందిన బాధుతురాలి కుటుంబాన్ని కలుసుకునేందుకు రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలంటూ యోగి ప్రభుత్వానికి ఆమె పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఓ దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసును నిఫ్ఫక్షపాతంగా దర్యాప్తు చేపి దోషులను కటకటాల వెనక్కి నెట్టాల్సిన పోలీసులే.. హడావుడిగా ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేయడమేంటని ఉమాభారతి ప్రశ్నించారు. అసలేం జరిగిందన్న విషయాన్ని తమ నాయకుల వద్ద వెళ్లబోసుకునేందుకు ఇప్పుడు ఆమె కుటుంబాన్ని, గ్రామంపై కూడా అంక్షలు విధిస్తున్నారు, కనీసం వారిని కలిసేందుకు వస్తున్న రాజకీయ నేతలను కూడా మార్గమధ్యంలోనే అడ్డుకుంటున్నారని ఇవన్నీ యూపీ పోలీసులు ఎందుకు చేస్తున్నారో దేశప్రజలకు చెప్పాల్సిన అవసరముందని అమె ప్రశ్నించారు.

హాత్రాస్ లో జరిగిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించి.. తాను ఈ విషయాల గురించి ఏమీ మాట్లాడ కూడదని అనుకున్నానని చెప్పారు, అయితే బాధిత కటుంబంపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారిందని అమె అన్నారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు జరుపుతోందని.. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఎవరూ కలవకూడదని,.. ఎవరూ ప్రభావితానికి గురి చేయకూడదని పోలీసులు అక్షేపించడం సమంజసం కాదన్నారు. సీట్ దర్యాప్తు నేపథ్యంలో బాధిత కుటుంబం ఎవరినీ కలవకూడదనే నిబంధన ఉందా? అని అమె ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల వల్ల సిట్‌ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయని అమె సూచించారు,

ఈ మేరకు వరుస ట్వీట్లలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై ఉమాభారతి మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై కూడా ప్రశ్నల వర్షం సంధించిన అమె.. కరోనా బారిన పడి చికిత్స పోందుతున్నట్టు తెలిపారు. దీంతోనే తాను బాధిత కుటుంబాన్ని కలుసుకోలేకపోయానని అన్నారు. లేనిపక్షంలో తాను ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసేదాన్ని అని ఆమె అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత వారిని పరామర్శిస్తానని తెలిపారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయనాయకులు, మీడియా వ్యక్తులను అనుమతించాలని యోగి ప్రభుత్వాన్ని కోరారు. బీజేపిలో తాను సీనియర్ నేతనని.. అంతేకాకుండా ఓ పెద్ద సోదరిలా పలు అభ్యర్థలనలు, సూచనలు చేశానని వాటిని తేలిగ్గా కొట్టిపారేయొద్దని సీఎం యోగిని అమె కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles