Will Waive Charges on Interest During Moratorium మారటోరియంపై వడ్డీ మాఫీ.. ఆర్నెళ్ల కాలానికి ఉపశమనం..

Centre to waive compound interest on loans up to 2 crore

Bank loans, central government, Supreme Court, interest waiver, repayment of loans, ruppees 2 crore, Reserve Bank of India (RBI), moratorium, Lockdown, coronavirus pandemic.

In a huge reprieve for borrowers, the government has told the Supreme Court that it is ready to waive interest on the repayment of loans of up to ₹ 2 crore, frozen by the Reserve Bank of India (RBI) in a six-month moratorium granted because of the coronavirus pandemic.

మారటోరియంపై వడ్డీ మాఫీ.. ఆర్నెళ్ల కాలానికి ఉపశమనం..

Posted: 10/03/2020 05:33 PM IST
Centre to waive compound interest on loans up to 2 crore

(Image source from: Timesnownews.com)

కరోనా మహమ్మారి పంజా విసరడంతో ఎందరెందరో తలరాతలు మారిపోయాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్షలతో ఎంతో మందికి ఉపాధి కరువైంది. మరెందరో వ్యాపారాలు దివాలా తీసాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పోందిన రుణగ్రహీతలకు మాత్రం ఎట్టకేలకు ఉపశమనం లభించింది, లాక్ డౌన్ నేపథ్యంలో ఆరు నెలల పాటు కేంద్రం ప్రకటించిన మారటోరియాన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలకు నెలవారి కిస్తులు వాయిదా పడటంతో పాటు ఈ ఆరుమాసాల కాలానికి అమలయ్యే వడ్డీపై వడ్డీని తామే భరిస్తామని కేంద్రం తాజాగా ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది.

లాక్ డౌన్ విధించిన కేంద్రమే వడ్డీపై కూడా నిర్ణయాన్ని తీసుకోవాలని, ఈ విషయంలో రిజర్వు బ్యాంకుపై నెపాన్ని వేసి భుజాలు తడుముకోవడం సమంజసం కాదని అత్యున్నత న్యాయస్థానం కాస్త కఠినంగా సూచించిన నేపథ్యంలో అప్పటివరకు ప్రతీ నెల వడ్డీ కడుతున్న వారికి తాము ఏం సమాధానం చెబుతామన్ని అక్షేపిస్తూ వచ్చిన కేంద్రం.. ఈ తరుణంలో మధ్యేమార్గంగా మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహ్రిషీ నేతృత్వంలో సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో కరోనా వైరస్ ప్రభావం దేశంలోని వివిధ రంగాలపై ఎంత మేర పడిందన్న విషయాలను అధ్యయనం చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రసర్కార్‌ తన వైఖరిని మార్చుకుని.. మార్చి నుంచి ఆగస్టు మాసం వరకు విధించిన మారటోరియంపై వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.

అంతకుముందు కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉపశమనాల్లో కేవలం మారటోరియం మాత్రమే కల్పిస్తామని, దీని వడ్డీపై వడ్డీ కట్టాల్సిందేనంటూ అదేశించిన కేంద్రం.. మారటోరియం పెట్టుకుంటే అధిక వడ్డీ కల్లాల్సివస్తుందన్న సంకేతాలను దేశ ప్రజల్లోకి పంపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించినా మారటోరియం కాలంలో విధించే వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం కుదరదని భారతీయ రిజర్వు బ్యాంకు సహా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపాయి. దీంతో కలో గంజో తాగి నిమ్మకుంటామే కానీ.. మారటోరియం జోలికి వెళ్లినా పరిస్థితి దారుణంగా వుందని అనేక మంది బ్యాంకు రుణగ్రహీతలు మారటోరియం ఆఫ్షన్ ను ఎంచుకునే ధైర్యం చేయలేకపోయారు.

మారటోరియం పెట్టుకుని తమకు లాభం ఏంటీ అని బ్యాంకుల నుంచి రుణాలు పోందిన రుణగ్రహితలు కేంద్రప్రభుత్వాన్ని పలు మాధ్యమాల ద్వారా ప్రశ్నించడంతో మారటోరియం కాలాన్ని ఆరు మాసాల నుంచి రెండేళ్ల కాలం వరకు పోడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వడ్డీపై వడ్డీని మాత్రం మినహాయించలేమని తేల్చిచెప్పింది. ఈ కరోనా కాలంలోనూ సక్రమంగా నెలసరి వాయిదాలు చెల్లిస్తున్న రుణగ్రహీతలకు తాము ఏం సమాధానం చెబుతామని.. చెప్పింది. ఇక తీరా మరటోరియం విధించే సమయం కూడా పూర్తైన తరువాత.. ఆగస్టు దాటిని అక్టోబర్ మాసంలో మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మారటోరియం పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేసిన రుణగ్రహీతలకు మాత్రమే లబ్ది చేకూరినట్లు అయ్యింది.

పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వినియోగ వస్తువుల కొనుగోళ్లకు తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తించనుంది. మారటోరియం కాలంలోనూ తమ నెలవారీ వాయిదాలను సక్రమంగా చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనాన్ని అందించనున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింద. దీంతో కష్టకాలంలోనూ తమ కిస్తులు కరెక్టుగా కట్టినవారికి కూడా కేంద్రం నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది, ఇక మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి పరిమితిని విధించింది. రూ. 2 కోట్ల వరుకు పోందిన రుణాలకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ వడ్డీలపై వడ్డీ మినహాయింపుతో కేంద్రంపై ఆరు లక్షల కోట్ల రుపాయాల భారం పడుతోందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles