SBI waives processing fees on loans via Yono app పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేయాలా.. అయితే ఫోన్ తప్పనిసరి..

Sbi waives processing fees on loans via yono app offers home loan interest rate discount

Sbi, SBI, Sbi loan, lender, banks, sbi processing fee, state bank of india, processing fees, interest rate, personal loans, car loans, home loans, gold loans, sbi, sbi atm, SBI OTP-based ATM withdrawal facility, state bank of india, sbi cash withdrawal, SBI OTP-based cash withdrawal, Business

The State Bank of India (SBI) has announced a 100 per cent waiver in its processing fee for all customers applying for car, gold, and personal loans through its YONO platform. According to the press release issued by the bank, it has announced various special festive offers on home loans for home buyers.

పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేయాలా.. అయితే ఫోన్ తప్పనిసరి..

Posted: 09/28/2020 09:15 PM IST
Sbi waives processing fees on loans via yono app offers home loan interest rate discount

భారతీయ స్టేటు బ్యాంకు తమ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఖాతాదారుల డబ్బును పటిష్ట భద్రతను కల్పించడంలో ఓటీపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన బ్యాంకు ఇకపై మరో చల్లటి కబురును అందించింది. ఇక తాజాగా దసరా, దీపావళి పండగ పర్వదినాలను పురస్కరించుకుని శుభకార్యాలకు శ్రీకారం చుట్టే ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంకు అధికారులు మరో శుభవార్తను అందించారు. పండగ పర్వదినాలను పురస్కరించుకుని రిటైల్ లోన్లు తీసుకోవాలనుకునే ఖాతాదారులకు పలు రాయితీలను ప్రకటించింది. బంగారం, పర్సనల్, కారు లోన్లు పోందాలనుకునేవారికి పలు ఫీజులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే అందుకు ఓ మెలిక పెట్టింది. ఈ రుణాలను బ్యాంకు నుంచి పోందాలనుకునే వారికి మాత్రం వర్తించవు. మరీ.? అంటూ అలోచనలో పడ్డారా.? అలాంటిదేమి లేదు కానీ బ్యాంకు ద్వారా కాకుండా యోనో ఆప్ ద్వారా ఈ రుణాలను ఈ పండగ సీజన్ లో తీసుకునే వారికి మాత్రమే రాయితీలను ఇవ్వనునున్నట్లు ప్రకటించింది. ఇంతకీ రాయితీ ఏంటంటే.. యోనో ఆప్ ద్వారా బంగారం, పర్సనల్, కారు లోన్లు రుణాలను తీసుకునే వారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండబోదని స్పష్టం చేసింది, దీంతో కనీసం మేర ఐదు నుంచి ఏడు వేల రూపాయల మధ్య రుణాలు తీసుకునేవారికి అదనపు లాభం లభించినట్టే.

ప్రభుత్వ అనుమతి పోందిన.. రేరా నిబంధనలు పాటిస్తున్న ప్రాజెక్టుల్లో గృహాలు, అపార్డుమెంట్లలో ఫ్లాట్టు కొనుగోలు చేసే ఖాతాదారులకు గృహరుణాలపై కూడా వంద శాతం ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే క్రెడిట్‌ స్కోరు, రుణమొత్తం ఆధారంగా 10 బేసిస్‌ పాయింట్లు మేర వడ్డీలో కూడా రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. అదే యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్లు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. పండగ వేళ బ్యాంకు ఖాతాదారులు ఏదో ఒక రుణం తీసుకునేలా ప్రోత్సహాకలు వున్నాయి. ఇక పండగ సెంటిమెంట్ నేపథ్యంలో డబ్బును రుణంగా తీసుకునే ఖాతాదారులకు, ఇంటి రుణాలు పోందే రుణగ్రహీతలకు బ్యాంకు అదనపు లాభం కల్పించినట్టే.

ఇక దీనికి తోడు సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునేవారికి 7.5 శాతం వడ్డీకే రుణసదుపాయం కల్పిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అలాగే ఎంపిక చేసిన మోడళ్లపై నూరు శాతం ఆన్ రోడ్‌ ఫైనాన్స్‌ చేస్తామని చెప్పింది. 7.5 శాతం వడ్డీకే బంగారు రుణాలు, 9.6 శాతం వడ్డీపై వ్యక్తిగత రుణాలు అందిస్తున్నామని ప్రకటించింది. పండగ సీజన్ లో ప్రజలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు గానూ ఎస్బీఐ తమ వంతు తోడ్పాటు అందిస్తోందని ఎస్బీఐ ఎండీ (రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌) సీఎస్‌ శెట్టి తెలిపారు. యోనో యాప్‌ ద్వారా పేపర్ లెస్‌ లోన్లు పొందొచ్చని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles