Twist in Vikarabad woman kidnap case వికారాబాద్ లో వివాహిత కిడ్నాప్ కేసులో ట్విస్టు..

Twist in vikarabad kidnap case deepika husbands car used in abducting her

Deepika, Akhil, Vikarabad kidnap case, New Twist, Family Disputes, Arya samaj, love marriage, police investigation, court, shopping, vikarabad, crime

The kidnap case of Vikarabad woman taking new turns with twists. Police investigation reveals that the husband of the woman kidnapped the woman. According to the reports, Deepika and Akhil got married in 2016 and due to disputes between the couple, Deepika is staying with her parents.

వికారాబాద్ లో వివాహిత కిడ్నాప్ కేసులో ట్విస్టు..

Posted: 09/28/2020 08:31 PM IST
Twist in vikarabad kidnap case deepika husbands car used in abducting her

వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసు సంచలనంగా మారింది. భర్తతో సంసారజీవితంలో గొడవల కారణంగా విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ఆ కేసు విషయంలో కోర్టు పేషీకి హాజరైన దీపికను అదే రోజున సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన కేసులో ట్వీస్టు ఏర్పడింది. అయితే ఈ గుర్తుతెలియని అగంతకులు ఎవరా అంటూ దర్యాప్తులో భాగంగా పోలీసులు కూపీ లాగడంతో.. అమె భర్త అఖిల్ కు చెందిన కారులోనే అగంతకులు అమెను కిడ్నాప్ చేశారని తెలుసుకున్నారు. అయితే ఇది ప్లాన్ ప్రకారం ఇద్దరికీ ఇష్టంతోనే జరిగిందా.? లేక భర్త తరపున అతని స్నేహితులు కావాలనే ఇలా చేశారా.? అన్నది పోలీసులు తేల్చాల్సివుంది.

దీపిక తల్లిదండ్రులు అమెను భర్తతో కలసి వుండాలని అఖిల్ పైనే దీపిక పోఈ కేసు కోర్టులో కొనసాగుతుండగానే భర్త అఖిల్ కు చెందిన కారులోనే గుర్తు తెలియని వ్యక్తులు దీపికను అపహరించుకుపోయారు. కారు ఆమె భర్తదే కావడంతో అతనే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి. దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితమే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే శనివారం ఇరువురు వికారాబాద్ కోర్టుకు కూడా హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ యువతిని కారులోకి లాక్కొని పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి వెళ్లిపోయారు.దీంతో దీనిపై దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర మూడు రూట్స్ కు వికారాబాద్ సెంటర్ పాయింట్ కావడంతో హైవే రూట్స్ లో పోలిస్ టీమ్స్ నిన్నటి నుండే జల్లెడ పడుతున్నారు. అయితే దీపికను ఎక్కడికి తీసుకెళ్ళారన్న విషయాన్ని ఇప్పటికీ పోలీసులు కనుగొనలలేదు,. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles