MP Special DG caught beating his wife in viral video 'సతిని సావగొట్టి.. నా ప్రాపర్టీ అనడం.. మీకే చెల్లు' డీజీపి సారూ..

Dg rank officer assaults wife after she catches him at another womans house

Purushottam Sharma, assualt, Wife, another women's house, CCTV footage, viral video, DG rank officer, Madhya Pradesh, crime

A shocking video has come to light where a DG rank officer can be seen beating and assaulting his wife in Madhya Pradesh. The incident took place after the man's wife found out about his alleged extra-marital affair.

ITEMVIDEOS: ‘‘సతిని సావగొట్టి.. నా ప్రాపర్టీ అనడం.. మీకే చెల్లు’’ డీజీపి సారూ..

Posted: 09/28/2020 09:44 PM IST
Dg rank officer assaults wife after she catches him at another womans house

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల జంట పోలీసు స్టేషన్ కు వెళ్తే.. భార్యల తరపున వకాల్తా తీసుకున్నట్లు నాలుగు నీతిసూత్రాలతో పాటు గృహహింస చట్టాన్ని పూసగుచ్చినట్టు చెప్పి కంగారెత్తిస్తారు. అంతేకాదు మగాడిని అదేనండీ భర్తలను సర్ధుకుపోవాల్సిందే.. లేదంటే కటకటాలే అని చెప్పే పోలీసులు మాత్రం తమకు చట్టాలు చుట్టాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. తన అసమర్థతను, లోపాన్ని ఎత్తిచూపిందన్న పగతో రగిలిపోతూ.. ఓ పోలీసు బాస్ తరువాత ఆంతటి స్థానంలో వున్న అధికారి మా్త్రం తన భార్యను చావచితకోట్టి.. మరీ అమె నా ప్రాపర్టీ.. అంటూ డైలాగ్ కోట్టి.. మనస్సున్న మనుషులను.. మనస్సు లేని వస్తువుగా పరగణించాడు.

ఇంతకీ ఆయన ఎవరంటే.. పోలీసు విభాగంలో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ఏడీజీ). అత్యున్నత హోదాను వెలగబెడుతున్న పురుషోత్తం శ‌ర్మ త‌న భార్య‌ తనను అక్రమసంబంధమున్న వారింట్లో చూసిందని.. తన ఇంటికి వచ్చిన తరువాత అమెను కింద ప‌డేసి.. ఆపై ఆమె మీద కూర్చుని ఆమెను చిత‌క‌బాదాడు. కాగా ఆ దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ వుమెన్ (ఎన్‌సీడ‌బ్ల్యూ) స్పందించింది. ఆ అధికారిపై వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ రాష్ట్ర సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు సూచించింది. దీంతో శ‌ర్మ‌ను ప్ర‌స్తుతం అక్క‌డి నుంచి బ‌దిలీ చేశారు. అత‌నిపై అత‌ని కుమారుడు ఫిర్యాదు చేయ‌గా పోలీసులు కేసు న‌మోదు చేశారు.

కాగా ఆ సంఘ‌ట‌న‌పై శ‌ర్మ‌ను మీడియా వివ‌ర‌ణ కోర‌గా.. 32 ఏళ్ల నుంచి తాము క‌ల‌సి జీవిస్తున్నామ‌ని, 2008లో ఆమె త‌న‌పై కంప్లెయింట్ ఇచ్చింద‌ని అన్నాడు. అయిన‌ప‌ప్ప‌టికీ అప్ప‌టి నుంచి ఆమె త‌న ఇంట్లోనే నివ‌సిస్తుంద‌ని, అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను పొందుతుంద‌ని, విదేశాల‌కు కూడా త‌న డ‌బ్బుతోనే వెళ్తుంద‌ని, అలాంట‌ప్పుడు ఆమెపై త‌న‌కు అన్ని అధికారాలు ఉంటాయ‌ని, ఆమె త‌న ప్రాప‌ర్టీ అని, ఆమెను హింసించ‌డం క‌రెక్టేన‌ని అత‌ను త‌న‌ను తాను స‌మర్థించుకున్నాడు. కాగా ఆ వీడియోపై నెటిజ‌న్లు కూడా స్పందిస్తున్నారు. వెంట‌నే అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అత‌న్ని పోలీసు ఉద్యోగం నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh