SP Balu son quashes rumors about the hospital bill 'ఎస్పీ బాలు' అభిమానులూ, అసత్య ప్రచారాలు వద్దు: చరణ్

Spbs son sp charan says hurt by rumours that delhi stepped in to settle hospital bills

singer Balasubrahmanyam, SP balasubrahmanyam hindi songs list, SP balasubrahmanyam, SP Sailaja, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, coronavirus, covid-19, sp Balasubrahmanyam, SPB, Balu, MGM Hospital, SP Charan, Hospital bills, VenkaiahNaidu, Social Media, Chennai, Tamil Nadu

SP Charan was forced to publish the video barely 24 hours after his father's burial as messages were going viral claiming that the family asked the Tamil Nadu government for help to pay the hospital bills, but it was BJP leader and Vice President Venkaiah Naidu who stepped in.

‘‘ఎస్పీ బాలు’’ అభిమానులూ,, అసత్య ప్రచారాలు వద్దు: చరణ్

Posted: 09/28/2020 02:31 PM IST
Spbs son sp charan says hurt by rumours that delhi stepped in to settle hospital bills

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురైన ఆయన కుటుంబాన్ని మరింతగా కుంగదీసేలా సోషల్ మీడియాలో కథనాలు రావడం అందర్నీ కలచివేస్తోంది. దీంతో పుట్టెడు దుఃఖంలో వున్నా వాటిని దిగమింగుకుని ఎస్పీ బాలు తనయుడు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై త్రీవంగా మండిపడ్డారు. అసంబద్ద కథనాలకు ఎలా అజ్యం పోస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి కథనాలు నేరపూరితమైనవని తెలిసినా.. ఎలా ప్రచారం చేస్తున్నారో అర్థంకావడం లేదని తెలయడం లేదన్నారు. గాయపడిన గుండెలను మరింత గాయపర్చవద్దని కోరారు.

ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఓ వీడియో సందేశాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. తన తండ్రి ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 24 వరకు అసుపత్రిలోనే చికిత్సపోందారని, అక్కడ తన తండ్రిని వారు ఇంట్లో కుటుంబ పెద్దను చూసుకున్నట్లుగానే చూసుకున్నారని అన్నారు. అయితే అంతటి సేవలు అందించినా వారిపై సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచారం జరుగుతోందని, దీన్ని వెంటనే అపాలని ఆయన కోరారు. తన తండ్రి అభిమానులు ఎవరూ ఇలాంటి పనులు చేయరని చెప్పారు. అసత్యప్రచారాలను విపరీతంగా ప్రచారం చేయడం వల్ల తమ కుటుంబంతో పాటు అసుపత్రి రెప్యూటేషన్ కూడా దెబ్బతింటుందని అన్నారు.

అసుపత్రి మెడికల్ బిల్లలు కోసం తాను తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడామని, అందుకు వారు అంగీకరించకపోవడంతో ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని ఆశ్రయించామని కూడా పుకార్లు పుట్టిస్తూ వాటని ప్రచారం చేస్తున్నారని అన్నారు. బాలుకు ఎలాంటి వైద్యం అందించారు..? వాటి బిల్లులు ఎంత, ఎంత చెల్లించారన్న విషయాలను సంబంధిత వ్యక్తులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎలా పోస్టులు పెడతారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను త్వరలోనే ఆసుపత్రి డాక్టరత్లో కలసి మీడియా ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. ఆసుపత్రి డాక్టర్లకు తాము ఎంతో కృతజ్ఞతాభావంతో వుంటామని ఎస్పీ చరణ్ అన్నారు.

అప్పటివరకూ దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులైతే మాత్రం ఆయన పరమపదించిన తరువాత కూడా ఇలా అమానించే రీతిలో వ్వవహరించరని అన్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఎస్పీబి అభిమానులు కారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా చెప్పారు. తన తండ్రికి వైద్యానికి కావాల్సిన పరికరాల కోసం అపోలో ఆస్పత్రిని సంప్రదించగా వారు వెంటనే వాటిని ఎంజీఎంకు పంపారని ఆయన చెప్పారు. వారంతా ఎంతో మంచి మనుషులు అంటూ చరణ్‌ తెలిపారు. ఇలాంటి సమయంలో అసత్యవార్తలు, అభూత కల్పనలు సృష్టించడం బాధాకరమని చరణ్ అవేదన వ్యక్తం చేశారు.

(Video Source: TV9 Telugu Live)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles