SBI customers can opt rbi guidelines ఎస్బీఐ క్రిడిట్ కార్డు కస్టమర్లకు ఊరట.. బకాయిల చెల్లింపుకు మరింత గడువు

Sbi card gives customers option to restructure credit card payments into loans

loan moratorium, banks, Supreme Court, SBI Cards, RBI Guidelines, credit card, payment, dues, interest rate, interest waiver, online payment, coronavirus, pandemic, COVID-19, SBI Card, India, Business, Economy

SBI Card is offering to restructure credit card payment of customers who availed moratorium into loans which have 70 percent lower interest rate, besides promising to pass on any relief ordered by the Supreme Court (SC) in future instalments.

ఎస్బీఐ క్రిడిట్ కార్డు కస్టమర్లకు ఊరట.. బకాయిల చెల్లింపుకు మరింత గడువు

Posted: 09/14/2020 08:05 PM IST
Sbi card gives customers option to restructure credit card payments into loans

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ విధానంతో కారణంగా మారటోరియం తీసుకుని, గడువు ముగిసినా బకాయిలు చెల్లించని క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు కొంత ఉపశమనం లభించే వార్తను చెప్పింది. రుణాలను తీసుకుని బకాయిలు చెల్లించని కస్టమర్లకు మరింత గడువునిచ్చే యోచనలో ఎస్బీఐ ఉందని తెలిసింది. పాత బకాయిలు చెల్లించేందుకు రుణాల గడువు పోడగింపును కల్పించడంతో పాటు రుణాలను తీర్చేందుకు కొత్త రుణాలను కూడా కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు యోచిస్తున్నారని సమాచారం.  

లాక్ డౌన్ నేపథ్యంలో రుణాల చెల్లించలేని రుణగ్రహీతలతో పాటు బకాయిలు చెల్లించని కస్టమర్లకు లాక్ డౌన్ విధించిన కేంద్రమే ప్రత్యామ్నామ మార్గాలను చూపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించిన నేపథ్యంలో రిజర్వు బ్యాంకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి బ్యాంకుల ఎదుటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎస్బీఐ క్రిడిట్ కార్డు కూడా వీటిని ప్రత్యామ్నాయంగా తమ కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఇందులో భాగంగా రెండు వేర్వేరు ప్రత్యామ్నాయాలలో దేనినో ఒకదానిని ఎంచుకోవాలని బ్యాంకు అధికారులు కస్టమర్లకు సూచించనున్నారు.

బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారులు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ పథకం, లేదంటే బ్యాంకు ప్రకటించిన రీపేమెంట్ గడువును ఎంచుకోవచ్చని ఎస్బీఐ కార్డ్స్ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్ తివారీ తెలిపారు. ఈ రెండింటిలోనూ వడ్డీ రేటు ఆకర్షణీయంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇక్కడో కిటుకు ఉంది. ఎస్‌బీఐ రీపేమెంట్ పథకాన్ని ఎంచుకుంటే, మారటోరియం గడువు ముగిసి బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు సిబిల్‌కు చేరవని తివారీ స్పష్టం చేశారు. అయితే, అంతమాత్రాన వారి పరపతి రేటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : loan moratorium  banks  SBI Cards  credit card  payment dues  RBI Guidelines  coronavirus  pandemic  COVID-19  

Other Articles