'PM busy with peacocks' Rahul Gandhi takes dig at Modi కరోనా విజృంభనతో కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Save your own lives because pm busy with peacock rahul gandhis jibe at modi govt

Coronavirus spread in India, Rahul Gandhi on coronavirus, Coronavirus deaths in India, Rahul Gandhi, Congress, Narendra Modi, PM Modi, BJP, Corona Virus, Lockdown, National politics

Congress leader Rahul Gandhi, who has been constantly criticizing the government over its handling of the pandemic, this morning attacked Prime Minister Narendra Modi yet again as he said people of the country have to 'save their own lives because PM is busy with peacock' amid sharp surge in coronavirus cases.

కరోనా విజృంభనతో కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Posted: 09/14/2020 09:08 PM IST
Save your own lives because pm busy with peacock rahul gandhis jibe at modi govt

(Image source from: Hmtvlive.com)

దేశంలో కరోనా విజృంభన శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా కబళించివేస్తున్నా.. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన ప్రధాన మంత్రి ప్రజలకు కరోనాపై మాటలు చెబుతున్నారే తప్ప.. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. సుమారు 80 వేల మంది దేశ ప్రజల ప్రాణాలను కరోనా కబళించి వేసినా.. వారికి కరోనాతో పాటు ఇతరాత్ర అరోగ్య సమస్యలు వున్నాయని అందుచేత వారు మరణించారని కేంద్ర ఆరోగ్య,కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించడం దేనికి సంకేతమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీని చూస్తుంటూ నీరో చక్రవర్తిలా ఇప్పుడు దేశ ప్రజలకు కనిపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏకంగా 50లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడినా.. అందులో ఏకంగా 10 లక్షల యాక్టివ్ కేసులతో అసుపత్రులలో చికిత్స పోందుతున్నా.. ఏ మాత్రం పట్టని ప్రధాని ఓ వైపు నెమళ్లతో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో దేశం అర్థికంగా పుంజుకునేందుకు ప్రజలపైనే భారం వేస్తూ ధరలను పెంచుతున్నారని తూర్పారబట్టారు, ఈ తరుణంలో దేశప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో వారి ప్రాణాలను వారే కరోనా నుంచి కాపాడుకోవాలని సూచించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ వారం గణనీయమైన సంఖ్యకు చేరుకుంటాయని, ఏకంగా కరోనా కేసులు 50 లక్షలకు చేరుకుంటాయని, యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరుకుంటాయని.. ఇక మరణాలు కూడా ఇప్పటికే 80వేలకు చేరకున్నాయని చెప్పారు. అంతులేని అహంకారం ఉన్న ఒక  వ్యక్తి...  ఆలోచన లేకుండా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయమే వైరస్ విస్తరించడానికి కారణమని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తన నివాసంలో నెమళ్లతో మోదీ గడిపిన వీడియోను షేర్ చేశారు. ఆలోచన లేకుండా విధించిన లాక్ డౌన్ తో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారని, లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Congress  Narendra Modi  PM Modi  BJP  Corona Virus  Lockdown  National politics  

Other Articles