కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలంటే ఒక్క తెలుగువారే కాదు భారతీయులతో పాటు దేశవిదేశాలకు చెందిన అనేక మంది భక్తులు హాజరవుతారన్న విషయం తెలిసిందే. స్వామివారి బ్రహోత్సవాల అంకురార్పణ నుంచి రధోత్సవాలను తిలకిస్తూ చక్రస్నానం వరకు అన్ని కార్యక్రమాలను తిలకిస్తూ భక్తపారవశ్యంలో మునిగుతుంటారు. ఈ నవరాత్రోత్సవాల సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు ఏడు కొండలకు చేరుకోవడం.. ఇక అక్కడ ఇసుక వేసినా రాలని విధంగా భక్తుల రద్దీ వుండటం తెలిసిందే. ఇలాంటి బ్రహోత్సవాలు ఒక్కపారి కాకుండా ఏకంగా రెండు పర్యాయాలు జరగుతుండటం విశేషం.
ఎప్పుడో కానీ ఓ సారి ఇలా జరుగుతుంది. భద్రపద మాసం అధికంగా రావడంతో ఈ సారి తిరుమల శ్రీవారు తన భక్తులకు ఏడాదిలో మూడు పర్యాయాలు తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు అభయప్రధానం చేస్తుంటారు. కన్నుల పండవగా సాగే ఈ ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా వస్తుండడం పరిపాటే. ఇలాంటి అదృష్టం అధములైన మానవులకు దక్కడం ఇష్టంలేని ఏ రాక్షసుడికి కన్నుకుట్టందో తెలియదు కానీ.. కరోనా మహమ్మారిని ప్రజలపై విసిరి.. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలకు కూడా భక్తులు లేకుండా నిరాడంబరంగా జరిపేలా చేశాడు.
అయినా దేవదేవుడు తనకు కలియుగ వైకుంఠంలో అంగరంగ వైభవంగా బ్రహోత్సవాలు జరిపడంతో అనాది నుంచి రాక్షసులపై ఆదిపత్యం వహిస్తూ.. దుష్టులైన రాక్షసులను సంహరించి జయిస్తూ,, మానవులను రక్షిస్తూ వస్తున్నాట్టుగానే ఈసారి కూడా కరోనా మహమ్మారిపై విజయాన్ని అందుకుని మానవజాతిని రక్షించనున్నాడని భక్తులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారికి సెప్టెంబర్ తో పాటు అక్టోబర్ మాసంలోనూ బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇవాళ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకున్నారు. ఆనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. అధికమాసం కారణంగా ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వెల్లడించారు. సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్వామివారి వాహన సేవలు తిరుమల మాడవీధుల్లో నిర్వహించడం వీలుకాదని, అందుకే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వివరించారు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గితే తదుపరి అక్టోబర్ బ్రహ్మోత్సవాలను పూర్వరీతిలో వెలుపల నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతినెలా టీటీడీకి వడ్డీ వచ్చేలా బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 50 కోట్లు రద్దైన నగదు నోట్లు టీటీడీ వద్దే ఉన్నాయి. వీటిని మార్చేందుకు ఆర్బీఐతో సంప్రదించాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఎక్కువ వడ్డీకి బంగారం డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. అక్టోబర్ 16వ తేదీ నుండి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి ఆలయాలు నిర్మిస్తామన్నారు. ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాన చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. వారణాసి, భువనేశ్వర్ లలో కూడ ఆలయాలను నిర్మిస్తామన్నారు.తిరుమలలో తాగునీటి మెయింటైన్స్ కోసం రూ. 10 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more