MP Raghurama Krishna Raju High Court decision on Aava Lands ఆవ భూముల కేసులో హైకోర్టు ఉత్తర్వులపై వైసీపీ ఎంపీ హర్షం

Hc decision benefits poor house site beneficiaries says mp raghurama krishna raju

Raghurama Krishnaraju, AP High Court, Decentralization, CRDA Bill, Amaravati Farmers, Aava Lands, Corruption, Kattappa, CBI, High Court, Andhra Pradesh, Politics

YSRCP MP Raghurama Krishna Raju said that Andhra Pradesh High Court decision on Aava lands will benifit the poor benificiaries of house sites. The MP also said the kattappa behind the entire aava lands episode will be caught along with the officials quoting the new anti-corruption Act.

ఆవ భూముల వెనుకనున్న కట్టప్ప చిక్కక తప్పదు: రఘురామకృష్ణరాజు

Posted: 08/28/2020 09:23 PM IST
Hc decision benefits poor house site beneficiaries says mp raghurama krishna raju

ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టంపై స్టేటస్ కోను హైకోర్టు సెప్టెంబరు 21 వరకు పొడిగించడం అమరావతి రైతులకు దక్కిన పాక్షిక విజయమని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో అంశంలోనూ హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించారు.  ఆవ భూముల కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని హైకోర్టు సీబీఐని కోరడం స్వాగతించదగ్గ పరిణామం అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మోసం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నవారికి ఇదోక చెంపపెట్టు కావాలని అన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగంతో పాటు ఇతరులు కూడా కుమ్మక్కైయ్యారని న్యాయస్థానం జోక్యంతో వారందరూ చట్టానికి చిక్కుతారని అన్నారు.

ఆవ భూముల కుంభకోణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వరదలకు మునిగిపోయే స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా భూములు మోకాలి లోతు నీళ్లలో మునగడం చూస్తుంటామని, కానీ ఆవ భూముల్లో 20 అడుగుల కర్ర పెడితే అది కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ఆవ భూముల్లో ప్రాథమిక పనులకు రూ.300 కోట్ల వ్యయం అవుతోందని తెలిపారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన లేఖ కూడా పక్కనబెట్టి ఆవ భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ కూడా విచారణలో వెల్లడవుతాయని తెలిపారు.

ధనార్జనే లక్ష్యంగా ఆవ భూముల్లో కుంభకోణం జరిగిందనేది జగద్విదితం అని స్పష్టం చేశారు. ఈ ఆవ భూముల వ్యవహారంలో ఓ కట్టప్ప ఉన్నాడని మనం ఇంతకుముందే చర్చించుకున్నామని, బాహుబలి రెండు సినిమాల్లో ఆ కట్టప్ప తప్పు చేసినా సరే బతికిపోయాడేమో కానీ, ఈ కట్టప్ప మాత్రం తప్పించుకోలేడని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఇప్పుడు అవినీతిపైనా కొత్త రూల్స్ వచ్చాయని, డబ్బులు ఇచ్చినవాడికి ఏడేళ్లు, తీసుకున్నవాడికి 35 ఏళ్లు శిక్ష అని పేర్కొన్నారని, అవినీతికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles