'Will Govt Support All Who Fought For Telangana' దర్శకుడికి భూమి కేటాయింపుపై హైకోర్టు అక్షింతలు..

Shock to telangana govt hc raises objection over govt land allotment to movie director shankar

high court shock to telangana govt, telangana govt land allotement, high court, telangana high court, high court on shankar land allotment, telangana high court questions on land allotment, telangana high court questions on shankar land allotment, director N Shankar, Ramoji Film City, film studio, valuable land, Telangana agitation

Telangana High Court questioned why the government had allocated such expensive land at a nominal price of Rs 5 Lakh per acre? to director N Shankar. To this the AG on behalf of the government replied to the court that director Shankar played a crucial role in Telangana agitation. Then the court said that there are thousands who have fought for separate state, will the government support all of them?

ITEMVIDEOS: తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్.? దర్శకుడికి భూమిపై ప్రశ్నలు వర్షం..

Posted: 08/27/2020 08:39 PM IST
Shock to telangana govt hc raises objection over govt land allotment to movie director shankar

రాష్ట్రప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వేల మందితో పాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వేలాది మందికి ప్రభుత్వం భూములను కేటాయిస్తుందా.? అని ప్రశ్నించింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కారుచౌకగా సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులకు అప్పగించడం సహేతుకం కాదని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తెలంగాణ సర్కారుకు అక్షింతలు వేసింది. టాలీవుడ్ దర్శకుడు శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.2.5కోట్ల విలువ చేసే భూమిని రూ.25లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ ఉద్యమంలో శంకర్‌ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాధానం పట్ల హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది త్యాగాలు చేశారని... వారందరికీ ఇలాగే భూములిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని.. మంత్రివర్గ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణలో రామోజీ ఫిల్మ్‌ సిటీ ఉండగా మరో ఫిల్మ్‌సిటీ అవసరమా? అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలకు ప్రభుత్వం గడువు కోరగా.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

(Video Source: NTV Telugu)

దేవుడు కూడా చట్టానికి అతీతం కాదు : హైకోర్టు

 

ఇక మరో కేసు విషయంలోనూ రాష్ట్రోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చివరకు దేవుడైనా చట్టానికి అతీతం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఖమ్మంలోని టీటీడీ కల్యాణ మండపం భూవివాదంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. వీహెచ్‌పీ నేత అంజయ్య దాఖలు చేసిన పిల్ ను ధర్మాసనం విచారించింది. టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కు తీసుకుంటున్నారని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. టీటీడీ ఆధీనంలో 12 గుంటల భూమి అదనంగా ఉందని ఖమ్మం కార్పొరేషన్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.

కాగా, ఇవాళ కేసును విచారించిన న్యాయస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది, ప్రభుత్వ భూమినే టీటీడీ ఆక్రమించిందా.? అన్నట్లుగా అనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేవుడి పేరిట భూ ఆక్రమణ సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. భూదస్తావేజులు, పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ సెప్టెంబరు 8కి కోర్టు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh