MP Raghurama Krishna Raju on High Court decision అమరావతి రైతులకు అందిన పాక్షిక విజయం: రఘురామ కష్ణంరాజు

Hc decision partial success for amaravati farmers says mp raghurama krishna raju

Raghurama Krishnaraju, AP High Court, Decentralization, CRDA Bill, Farmers, Amaravati, AP Capital, Liquor Brands, people health, Andhra Pradesh, Politics

YSRCP MP Raghurama Krishna Raju said that extension of status quo on Decentralisation and CRDA Repeal Acts by the AP High Court is a partial success for Amaravati farmers. Speaking to the media on Thursday, the MP asked farmers to pray for the High Court judges along with their gods.

ITEMVIDEOS: అమరావతి రైతులకు అందిన పాక్షిక విజయం: రఘురామ కష్ణంరాజు

Posted: 08/27/2020 08:02 PM IST
Hc decision partial success for amaravati farmers says mp raghurama krishna raju

ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టంపై స్టేటస్ కోను హైకోర్టు సెప్టెంబరు 21 వరకు పొడిగించడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా కోనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొన్న నెలలుగా దీక్ష చేస్తున్న ఆ ప్రాంత రైతులకు దక్కిన పాక్షిక విజయమని అభివర్ణించారు, న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు త్వరలోనే పూర్తి విజయాన్ని కూడా అందుకుంటారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. రైతులు మరింత ఆశాభావంతో ఉండాలని, కళ్లు లేకపోయినా మనసున్న న్యాయస్థానాల ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పునరుద్ఘాటించారు.

ఫలితం కాస్త ఆలస్యమైనప్పటికీ గాంధేయ మార్గంలో ముందుకెళ్లాలని అమరావతి రైతులకు ఉద్బోధించారు. అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకే అంతిమ విజయం కూడా దక్కుతుందని ఆయన అకాంక్షించారు, దేవుడు తమవైపు ఉన్నాడని, న్యాయం తమవైపు ఉందని అన్నారు. స్టేటస్ కో అయినా, స్టే అయినా పెద్దగా తేడా ఏమీ లేదని, న్యాయమూర్తులే దేవుళ్లని పేర్కొన్నారు. కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం 4 గంటలకు వదిలినట్టు తనకు తెలిసిందని, రైతులను అరెస్ట్ చేయడం బాధాకరమని రఘురామ వ్యాఖ్యానించారు. మద్యం తాగితే లివర్ చెడిపోతుందన్నది జగమెరిగిన సత్యం అని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

ఏపీలో మద్యం బ్రాండ్లపై స్పందిస్తూ, ఆ ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ, విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నారు. ఏపీలో అమ్మే ఆ మద్యం బ్రాండ్లకు పేర్లు ఎలా పెడతారో, వాటి నాణ్యత ఏమిటో, వాటి రేట్లు ఏమిటో అర్థంకావడంలేదని తెలిపారు. "దీని గురించి ఇటీవలే ఓ విజ్ఞుడు చెప్పాడు... పేరున్న బ్రాండ్లన్నీ పక్కరాష్ట్రాల్లో అమ్ముతున్నారని, ఏపీలో మాత్రం గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, నోబెల్ ప్రైజ్, భారతరత్న వంటి బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నాడు. పక్కరాష్ట్రాల్లో దొరుకుతున్న మద్యం రోజుకు ఓ క్వార్టర్ తాగితే 20 ఏళ్లలో లివర్ చెడిపోతుంది అనుకుంటే, మన రాష్ట్రంలో దొరికే మద్యం ఒక క్వార్టర్ తాగితే రెండు, మూడేళ్లలోనే హరీ మంటారని చాలామంది అంటున్నారని ఆయన అన్నారు.

ఈ బ్రాండ్ల రుచి తానేనెప్పుడూ చూడలేదని.. తనకైతే తెలియదన్న ఆయన ఈ మేరకు ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ‘‘మద్యంతో రూ.22 వేల కోట్ల రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా ప్రజాధనమైనా అయ్యుండాలి, లేకపోతే అమ్మఒడి సొమ్మో, లేక రైతు భరోసానో, రాజన్న, జగనన్న స్కీముల్లోంచి అయినా వచ్చుండాలి. మరి, అంత ఆదాయం వస్తున్నప్పుడు ప్రజల ఆయుర్దాయం పెంచే బ్రాండ్లు తెస్తే బాగుంటుంది. మద్య నిషేధం అంటున్నారు కాబట్టి పూర్తిగా అమలు చేస్తే మంచిది. అలాకాకుండా ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ఆయుర్దాయం తగ్గించవద్దు" అంటూ వ్యాఖ్యానించారు.

(Video Source: ABN Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles