Four prisoners recovered from covid, flee from Gandhi 'గాంధీ' నుంచి నలుగురు కరోనా ఖైదీల పరార్..

Four prisoners undergoing covid 19 treatment at gandhi hospital missing

Gandhi Hospital, Charalapalli central jail, charlapallu jail prisoners, prisoners went missing, COVID-19, coronavirus, Charlapalli, Telangana, Crime

Four Charlapalli Jail prisoners, who were undergoing treatment for COVID-19 at the Gandhi Hospital here, went missing on Thursday. These prisoners were admitted to the Gandhi Hospital after they tested positive for COVID-19. They went missing from the hospital since 3 am on Thursday, an official said.

గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు కరోనా ఖైదీల పరార్..

Posted: 08/27/2020 09:05 PM IST
Four prisoners undergoing covid 19 treatment at gandhi hospital missing

(Image source from: Timesofindia.indiatimes.com)

గాంధీ ఆసుపత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది. గత కొన్నాళ్లుగా కోవిడ్ చికిత్సలో వైద్యులు, వైద్య సిబ్బందిపై కథనాలతో వార్తలతో నిలిచిన గాంధీ ఆసుపత్రి.. ఇవాళ మరో విషయంలోనూ వార్తల్లో నిలిచింది. గాంధీ అసుపత్రిలో కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు టాయిలెట్ లోని కిటీకీ నుంచి పారిపోయారన్న వార్త కలకలం రేపుతోంది. ఖైదీలకు కేటాయించిన వార్డు ఎంత పటిష్టంగా వుందన్న విషయంతో పాటు పోలీసులు పనితీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో వార్డుల్లో వైద్య సిబ్బంది పర్యవేక్షణ కూడా చర్చకు వస్తోంది.

ఇక ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి జైల్లో అండర్ ట్రయల్ లో భాగంగా జుడీషియల్ కస్టడీలో వున్న కొందరు ఖైదీలు కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అధికారులు వారిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కాగా, కరోనా మహమ్మరి నుంచి కొలుకున్న నలుగురు ఖైదీలు ఈ తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి తప్పించుకున్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులోని ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు.

తమ వార్డులోని బాత్రూమ్‌ కిటికీ వున్న ఇనుప చువ్వలు (గ్రిల్స్‌) తొలగించి పరారయ్యారు. వార్డు బయట పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ బాత్రూమ్‌ నుంచి పారిపోయారు. అయితే నలుగురు ఖైదీలు ఒకేసారి బాత్ రూమ్ లోకి వెళ్తున్నా వైద్య సిబ్బందిని గమనించకపోవడం గమనార్హం. ఇక చేతులు కాలిన తరువాత అన్నట్లుగా.. ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో 10 మంది ఖైదీలు చికిత్స పొందుతుండగా వారిలో నలుగురు ఖైదీలు పరారయ్యారని చర్లపల్లి జైలు వార్డన్ సంపత్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles