Corona vaccine is free of cost: Adar Poonawalla భారతీయులకు కరోనా వాక్సీన్ పూర్తి ఉచితం: పూనావాలా

Coronavirus vaccine to cost under rs 1000 per shot adar poonawalla

Coronavirus vaccine, covid-19 vaccine, coronavirus vaccine price india, covid-19 vaccine price india, covid-19, oxford vaccine, oxford astrazeneca covid-19 vaccine, coronavirus latest news, covid-19 latest news, covid-19 vaccine price in india

Amid speculations of researchers across the globe making great inroads into developing coronavirus vaccines, Serum Institute of India CEO, Adar Poonawalla has disclosed information on how much the vaccine could cost in India.

భారతీయులకు కరోనా వాక్సీన్ ఫ్రీ.. ప్రభుత్వానిదే ఖర్చు: పూనావాలా

Posted: 07/22/2020 01:08 PM IST
Coronavirus vaccine to cost under rs 1000 per shot adar poonawalla

(Image source from: Forbesindia.com)

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి అస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి మానవ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన మరుసటి రోజున, ఇండియాలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అనుమతులు పొందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇక్కడే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇండియా నుంచి 60 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి అవుతుందని, ఇండియాలో ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి, ప్రజలకు ఉచితంగా అందిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగానే ఇది జరుగుతుందని పూనావాలా స్పష్టం చేశారు.

కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ లను తయారు చేస్తున్న సంస్థ అయిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ, ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, వ్యాక్సిన్ ట్రయల్స్ ఒక్కో దశా విజయవంతంగా పూర్తవుతూ ఉందని, ఒకసారి నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు లభిస్తే, భారీ ఎత్తున తయారీకి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. "ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియా కోసమే వినియోగిస్తాం. మిగతా 50 శాతం ఎగుమతి చేస్తాం. అది కూడా ప్రతి నెలా తయారయ్యే వ్యాక్సిన్ పరిమాణం ఆధారంగా ఉంటుంది. భారత ప్రభుత్వం మాకెంతో మద్దతుగా నిలుస్తోంది. ఇది ప్రపంచ కష్టమన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ వ్యాక్సిన్ అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రపంచం మొత్తానికి మనం రక్షణ కల్పించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అనుకున్న ప్రకారం ట్రయల్స్ పూర్తన తరువాత, అనుకున్నట్లుగా సత్ఫలితాలు వచ్చిన పక్షంలో నవంబర్ లేదా డిసెంబర్ లో కొన్ని లక్షల డోస్ లు సిద్ధమవుతాయని ఆయన అన్నారు, 2021 తొలి త్రైమాసికం నాటికి 30 కోట్ల నుంచి 40 కోట్ల డోస్ లను సిద్ధం చేస్తామని అన్నారు. తొలి దశ వ్యాక్సిన్ ను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో మాత్రం కేంద్రానిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను 2 నుంచి 3 డాలర్ల లోపే (సుమారు రూ. 150 నుంచి రూ. 230లోపు) అందించాలన్న నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఇక ఈ వాక్సీన్ విజయవంతం, కావాలని సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ లేకుండా సురక్షితం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో కరనా మహమ్మారిని దేశం నుంచి తరమివేయవచ్చనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles