Kadiyam and Ambati tested corona positive ఇటు శ్రీహరి.. అటు అంబటి.. కరోనా తెచ్చింది సంకట స్థితి..

Kadiyam srihari and ambati rambabu tested corona positive

Coronavirus, Covid -19, Kadiyam Srihari, Ambati Rambabu, corona positive, YSRCP MLA, Sattenapalli constituency, former Deputy CM, Andhra Pradesh, Telangana

Coronavirus continues to spread rapidly across Telugu states Telangana and Andhra Pradesh. In Andhra Pradesh YSRCP MLA of Sattenapalli constituency Ambati Rambabu was recently diagnosed with Coronavirus. irrespective of common people, the doctors, the medical staff, the police. Now public representatives and even political leaders are under tension who have been affected with Coronavirus.

ఇటు శ్రీహరి.. అటు అంబటి.. కరోనా తెచ్చింది సంకట స్థితి..

Posted: 07/22/2020 07:52 PM IST
Kadiyam srihari and ambati rambabu tested corona positive

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలను ఇప్పటికే తన ప్రభావానికి గురిచేసిన మహమ్మారి ఇక తాజాగా తెలంగాణలో మాజీ ఉపముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై కూడా ప్రభావాన్ని చాటింది. తెలంగాణలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్, బీజేపి నేతలను కూడా కరోనా షేక్ హ్యాండ్ ఇచ్చింది. వీరితో పాటు ఏకంగా నిత్యం భద్రతా వలయంలో వుండే మంత్రులను, ఉఫ సభాపతులను కూడా పలుకరించింది. అయితే వీరంతా ప్రస్తుతం కోలుకుని అప్రమత్తంగా వున్నారు.

ఇక రెండు రోజుల క్రితమే కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు ఆయన భార్య, తనయుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి వరకు ఆయన హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందనున్నట్టు సమాచారం.

వైసీపీ కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పాజిటివ్ అని నిన్న రాత్రి తేలగానే పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. ఇప్పుడు తాజాగా పార్టీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయితే సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఆయన రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా రెండు పర్యాయాలు రెండు వేర్వేరు నివేదికలు రావడం కూడా ప్రశ్నార్థకంగా మారింది.

గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే అంబటి కావడం గమనార్హం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలు కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని అధికారులను అంబటి కోరారు. మరోవైపు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయిరెడ్డి చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles