Police exchange fire with Maoists in Andhra Pradesh మన్యంలో పోలీసులకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు

Police exchange fire with maoists near visakha landulu forest area

Maoists, Exchange of fire, Visakhapatnam Agency, Visakhapatnam, police maoists firing, maoists, AP Police Maoists Firing,Thokkuguda village, Thiryani Mandal, Kumaram Bheem Asifabad district, Adilabad news, Nirmal district, Telangana, Andhra Pradesh

An exchange of fire took place between the Special Police party and the outlawed Maoists in the forest near Landulu forest area of Visakhapatnan in Andhra Pradesh, Just after five days the same incident took place in Thokkuguda village of Thiryani Mandal in Kumaram Bheem Asifabad district. No casualties or injuries were reported from both the sides and the armed men of banned CPI (Maoist) slipped into the deep forest.

విశాఖ మన్యంలో కాల్పుల మోత.. మావోలు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు

Posted: 07/20/2020 12:39 PM IST
Police exchange fire with maoists near visakha landulu forest area

తెలుగు రాష్ట్రాలలో మళ్లీ మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.? అందుకు అనుగూణంగా తమ క్యాడర్ ను పెంచుకుంటున్నారా.? క్యాడర్ పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాలనే వారు ఎంచుకున్నారా.? అన్న ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని అప్పటి నేతలు చెప్పినా.. ఈ రెండు రాష్ట్రాలు ఏకంగా మావో రహిత రాష్ట్రాలుగా ఉత్భవించాయి. అయితే తాజాగా మావోయిస్టులు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మొన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, బహిష్కృత సిపీఐ(మావోయిస్ట్) సభ్యులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మన్యం ప్రాంతాల్లో మావోలు టార్గెట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా వున్న ఏజెన్సీ ప్రాంతాల్లో కాల్పుల మోతతో దద్దరిల్లాయి. మన్యంలోని ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా  మారిపోయింది. దశాబ్ద కాలం క్రితం విన్న కాల్పులు మోతలు మళ్లీ ఒక్కసారిగా వినిపించేసరికి అక్కడంతా బీతావాహ వాతావరణ అలుముకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివారం భీకరంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు.. ఆదివారం సాయంత్రం రెక్కీ నిర్వహించాయి. ఆ సమయంలోనే లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత సమయం పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి లభించినట్లు తెలుస్తోంది. కాగా, గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను మావోయిస్టు పార్టీ వేగవంతం చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని ఆదిలాబాద్‌, అసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలపాలపై పోలీసులు బలగాలు నిఘా పెట్టాయి. అలాగే ఏపీలో సైతం ఎప్పటికప్పుడు మవోల కదలికలపై నిఘా ఉంచారు. గత వారంలో తెలంగాణలోనూ మావోలు తప్పించుకున్నారు. అసిఫాబాద్ మండలంలోని తుక్కుగూడ గ్రామంలో కూంబింగ్ చేస్తున్న పోలీసుల ప్రత్యేక బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు, దీంతో ఇరువర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులకు తారసపడిన ముగ్గురు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరిపారని పోలీసు వర్గాల సమాచారం. కాగా మావోలకు పోలీసు బలగాలు కూడా ధీటుగానే సమాధానమిచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles