TTD's former chief Priest died due to Covid-19 కరో్నాతో శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడి మృతి

Ttds former chief priest srinivasa murthy deekshitulu died due to coronavirus

Srinivasa Murthy Deekshitulu, TTD former chief priest, Coronavirus in Tirumala, Ramana Deekshitulu, Ramana Deekshitulu on corona, Ramana Deekshitulu on TTD officials, Coronavirus on seven hills Shrine, Coronavirus to TTD priests, coronavirus to TTD Employees, coronavirus TTD staff, TTD meet amid coronavirus, TTD priests, TTD staff, TTD Employees, coronavirus, covid-19, lockdown, chittor collector, Bharat Gupta, Tirumala, Turupati, Andhra pradesh

Former chief priest of Lord Venkateshwara temple on Tirumala Srinivasa murthy Deekshitulu who has suffered with novel coronavirus has breathed his last today morning, while undergoing treatment in tirupati covid hospital.

తిరుమలపై కరోనా కలకలం.. శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడి మృతి

Posted: 07/20/2020 02:56 PM IST
Ttds former chief priest srinivasa murthy deekshitulu died due to coronavirus

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. అక్కడి, ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడకు చోచ్చుకెళ్తోంది. లాక్ డౌన్ విధింపుతో సుమారు 80 రోజుల పాటు భక్తుల తాకిడి లేకుండా వెలవెలబోయిన కలియుగ వైకుంఠంలో అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ తరుణంలో పవిత్ర కోండపై కరోనా కలకలం రేగింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా కారణంగా ఇవాళ ఉదయం (75) కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం ఆయన వైరస్‌ బారిన పడ్డారు.

తిరుపతిలోని తితిదే కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లు సేవలు అందించిన ఆయన కరోనా బారిన పడి తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసమూర్తి దీక్షితులకు ఆలయం సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles