కరోనా సమయంలో ఎక్కడ ఏ వేడుకలు చేసుకున్నా ఇబ్బందిగా భావించిన ఓ జంట.. తమ బంధుమిత్రులతో కలసి సురక్షితమైన.. ఏ బదరాబంధీ లేని ప్రాంతంలో వేడుక చేసుకోవాలని భావించింది. అంతే వారికి తమకు చేరువలో వున్న అటవీ ప్రాంతం కన్నా సురక్షితమైన ప్రాంతం ఏదీ లేదని తోచింది. అంతే తమ మిత్రబృందంతో కలసి స్థానికంగా వున్న అటవీ ప్రాంతానికి వెళ్లి సంబరాలు ప్రారంభించారు. అంతే అప్పటికే ఎంతో సేపట్నించి ఓ చెట్టుపై నుంచి చూస్తున్న ఓ జీవి కేక్ కట్ చేయగానే అమాంతం కేక్ మొత్తాన్ని తీసుకుని వెళ్లింది. మా అడవిలో ఈ మానవ మాత్రులకేం పని..? అనుకుందో లేక మరేంటో తెలియదు కానీ ఆ జీవి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద... ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి... తనకు పెళ్లై అయి సంవత్సరం పూర్తైన సందర్భంగా... అడవిలో చిన్న కేకు పార్టీ ఏర్పాటు చేశాడు. అందరూ చూస్తుండగా... ఓ రాయిపై చాకొలెట్ కేకు ఉంచి... చాకుతో ఓ ముక్కను కట్ చేశాడు. ఆ ముక్కను ఎవరికో ఇవ్వబోతుంటే... అతని వెనక నుంచి వచ్చిన ఓ కోతి... కాళ్ల మధ్య నుంచి... రాయిని చేరి... ఈజీగా కేకు మొత్తాన్నీ లాక్కొని... చకచకా చెట్టెక్కేసింది. అంతే... పార్టీ కాస్తా... చెట్టెక్కినట్లైంది. కోతి అలా చేస్తుందని అస్సలు ఊహించని వారంతా... స్టన్ అయి దాన్ని చూస్తూ ఉండిపోయారు.
ఈ ఫన్నీ వీడియో అందరికీ తెగ నచ్చేస్తోంది. అడవిలో పార్టీలు పెట్టుకుంటే ఇలా అవుతుందని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. అడవుల్లో పార్టీలకు సర్‌ప్రైజ్‌లు గ్యారెంటీ అని నందా కాప్షన్ పెట్టారు. జులై 9న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే... 32వేల మంది చూడగా... 3వేల మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్లు ఈ వీడియో చూసి బాగా నవ్వుతున్నారు. ఓ యూజర్ ఏం రాశారంటే... "కోతి: నువ్వు నన్ను పిలిచావా లేదా అన్నది నాకు అనవసరం. నేను ఎంటరైతే... అంతా నా కంట్రోల్‌లో ఉంటుంది." మరో యూజర్ ఏమన్నారంటే... అడవిలో జంతువులు ఉండటం కామన్ కాబట్టి... ఈ పార్టీకి అతనే అతిథిగా వచ్చినట్లు లెక్క అని అన్నారు. మరొకరు... "మంచి కోతి... ఆ కేకును కోసే వరకూ ఆగింది" అని రాశారు.
Celebrating wedding anniversary in Forest is an experience altogether....
— Susanta Nanda IFS (@susantananda3) July 9, 2020
Surprises guaranteed pic.twitter.com/gFR7glcmp6
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more