దేశానికి గుజరాత్ అంటే గౌరవం. జాతిపిత మహాత్మ గాంధీని అందించిన రాష్ట్రం. అంతేకాదు ఉక్కు మనిషి సర్థార్ వల్లభబాయ్ పటేల్ ను కూడా అందించిన రాష్ట్రం. వారికి గుర్తుగా సబర్మతి ఆశ్రమంతో పాటు ఐక్యతా విగ్రహం కూడా స్థాపించారు. అంతేకాదు మహాత్ముని రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు జరగవు. ఇది చిన్నపిల్లలను అడిగినా చెప్పేస్తారు,. ఎందుకంటే పాఠ్యపుస్తకాలలో ఇది రాసి వుంది. అయితే ఇదంతా కేవలం ఫాఠ్య పుస్తకాలకు, పేపర్ల రాసుకోవడానికి మాత్రమే.. అంటున్నారు అక్కడి బీజేపి నేతలు. గాంధీ పుట్టిన రాష్ట్రంలోనూ తాము బీరు, బ్రాండీ పోర్లిస్తామని, ఎక్కడ పడితే అక్కడే తమ బార్లు ఏర్పాటవుతాయని మరీ చెబుతున్నారు.
మద్యం అమ్మకాలు జరిగే రాష్ట్రాల్లో ఎక్కడ బారు పెట్టాలన్నా అనుమతులు కావాలి.. ఎక్కడా మద్యం దుకాణాలు తెరవాలన్నా కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి కానీ తమకు అవేమి అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా బారుగా మారాల్సిందేనని అంటున్నారు. అంతవరకు వస్తే నడి రోడ్డు కూడా బారుగా మారిపోవాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. ఈ మద్య రహిత రాష్ట్రంలో తాము అనుకున్నదే జరగుతుందని మరీ బీరాలు పోతున్నారు. అంతకుమించి అనుకున్నదే తడవుగా ఆచరణలోనూ పెట్టేశారు. అధికార బీజేపి పార్టీకి జిల్లా నేత ఏకంగా నడిరోడ్డుపై మందు పార్టీ ఇచ్చారు. తన పుట్టిన రోజు అందిరికీ ఫుల్లుగా ఫుల్లు బాటిల్స్ ఇచ్చేశారు. తన అనుచరులను ఖుషీ చేశాడు.
तलवार से काटा केक,
— Gopi Maniar ghanghar (@gopimaniar) July 11, 2020
शराब की महेफील और बिना सोशल डिस्टन्स के मज़ा ले रहे है ये है,
जीस का जन्मदिन हे वो है, महीसागर ज़िले का बीजेपी का कन्वीनर कवन पटेल हैं। @SP_Mahisagar @BJP4Gujarat pic.twitter.com/rkcF8AlsvV
అసలే కరోనా.. ఇప్పుడు అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. అయినా కూడా రోడ్డు మీద ఎలాంటి సామాజిక దూరం పాటించకుండానే మందు పార్టీ, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఓ పెద్ద కత్తిని తీసుకుని కేక్ కట్ చేసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడికి వచ్చిన వారు మద్యం పోశారు. తమ మీద కూడా మందు పోసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గుజరాత్‌లోని మహీసాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ బీజేపీ నేత జిల్లా కన్వీనర్ కన్వల్ పటేల్‌గా గుర్తించారు. ఈ వీడియోలో కన్వల్ పటేల్ కారు బానెట్ మీద పెట్టిన భారీ కేకును కత్తితో కోస్తున్నారు. అంతలోనే ఆయన ఫ్రెండ్స్ బాటిల్స్ ఓపెన్ చేసి మందు అందరి మీదా పోస్తూ హంగామా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మెహ్రా కూడా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more