Hyderabad Man's Last Message For Father ‘'గుండె అగిపోయ్యింది’'.. తండ్రికి కరోనా రోగి చివరి మెసేజ్

They discontinued oxygen hyderabad mans last message for father

Government Chest Hospital, Erragadda, coronavirus, covid, corporate hospital, patients last message, ravi kumar, venkateshwarlu, jawaharnagar, Telangana, Crime

A video by a dying 34-year-old man giving his last message to his father from a government hospital in Hyderabad has left people shocked amid the coronavirus pandemic. The man was finally admitted to Hyderabad Government Chest Hospital after at least 10 private hospitals refused admission, the man's father said.

ITEMVIDEOS: ‘‘అసుపత్రికి పోతే సంపేస్తరు.. రిటర్న్ రాను..’’ తండ్రికి కరోనా రోగి చివరి మెసేజ్

Posted: 06/29/2020 07:32 PM IST
They discontinued oxygen hyderabad mans last message for father

కరోనా వైరస్ మహమ్మారి రోగులను ఎంతలా నరకయాతన అనుభవించేలా చేస్తోందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మనిషికి తన మరణం గురించి తెలియదు.. కానీ కరోనా ప్రభావానికి గురైన వ్యక్తులకు పరిస్థితి దిగజారిపోతే వారికి మరణం కనిపిస్తోంది. శరీరంలోని ముఖ్య అవయకావాలు పనిచేయకుండా నిలిచిపోవడం వారికి తెలుస్తోందనడానికి ఈ కరోనా రోగి పంపిన వీడియోనే సాక్షం. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాతీరుకు ఇది కొలమానం కాకపోయినా.. కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మాత్రం అక్కడ ఎలాంటి వైఖరికి ఎదురవుతుందో కూడా ఈ కరోనా రోగి తన తండ్రికి పంపిన అంతిమ వాట్సాప్ వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. హైదారాబాద్ చెస్ట్ అసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో తమకు పట్టి పీడిస్తున్నది కరోనా మహమ్మారేనా అని తెలుసుకోవడంలో కూడా కష్టంగానే మారింది. ఆసుపత్రులు కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నా వారిని చేర్చుకోవడం లేదు. మరీ ముఖ్యంగా నగరంలోని కార్పోరేట్ అసుపత్రులైతే.. ప్రముఖులైన వ్యక్తులను మాత్రమే కరోనా లక్షణాలున్నా అసుపత్రులలో చేర్చుకుంటున్నాయి. అంతేకానీ సర్వసాధారణమైన ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే జవహార్ నగర్ ప్రాంతానికి చెందిన రవికుమార్ విషయంలోనూ జరిగింది. అంతకుముందు పలువురికీ ఇదే అనుభవం ఎదురైంది. పదేళ్లుగా సౌదీ అరేబియాలో పనిచేసిన రవికుమార్ రెండేళ్ల క్రితం దేశానికి తిరిగివచ్చి తల్లిదండ్రుల వద్దే వుంటున్నాడు.

గత కొంతకాలంగా సోంతింటి నిర్మాణ పనులపై తిరుగుతున్న అతడు ఈనెల 23న అస్వస్థతకు గురయ్యాడు, అతడికి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారడంతో తన తండ్రి వెంకటేశ్వర్లును తోడుగా తీసుకుని నగరంలోని 11 కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు తిరిగినా లాభం లేకపోయింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన 24న సాయంత్రం ఓ ప్రైవేటు ల్యాబ్ లో కరోనా పరీక్షకు నమూనాలిచ్చాడు. అదేరోజు రాత్రి ఇబ్బంది మరింతగా పెరగడంతో, తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి చెస్ట్ అసుపత్రికి వెళ్లాడు. అక్కడ అసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు అతడి పరిస్థితిని చూసి వెంటనే అక్సిజన్ అమర్చారు.

కాగా అదే రోజు రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఆక్సిజన్ తొలిగించారని, ఊపిరి ఆడటంలేదని బతిమిలాడినా మళ్లీ పెట్టలేదంటూ వెంకటేశ్వర్లు అరోపించారు, ఈ అరోపణలకు సంబంధించి తన కుమారుడు రవికుమార్‌ అర్ధరాత్రి 12.30 సమయంలో ఊపిరాడక అనుభవిస్తున్న నరకాన్ని సెల్ఫీ వీడియోను చూపాడు. ఓ వైపు ప్రాణం పోతుందని తెలిసి కూడా, తన గుండె అగిపోతోందని కూడా అర్థమైన రవికుమార్.. తన తండ్రికి తన పరిస్థితిని తెలపాలని.. శ్వాస అందక ఇబ్బందులు పడుతున్నా., బలం కూడగట్టుకుని.. ఉపిరిని బిగపట్టి తన తండ్రికి తన చివరి సందేశాన్ని పంపాడు. తన తల్లితో పాటు భార్య, కుమార్తె, కుమారుడికి కూడా బై అని చెప్పాడు.

ఇక రవికుమార్ పంపినీ వీడియో సారంశమిలా వుంది. ‘‘ బతుకుతనంటివ్ గద డాడీ.. నేనేం చెప్పిన డాడీ.. సంపేస్తరు డాడీ.. పోతే రిటన్ రాను డాడీ అని చెప్పిన గద డాడీ.. ఊపిరాడ్తలేదంటే కూడా చెప్పే వినకుండా వెంటిలేటర్‌ బంద్‌ చేసిన్రు.. బతిమిలాడి సాల్‌సాల్‌ అయ్యింది. ఇప్పట్కీ మూడు గంటలైంది డాడీ.. నాకు ఊపిరి ఆడ్తలేదు.. గుండె ఆగిపోయింది డాడీ.. బై డాడీ బై.. అందరికీ బై’’.. అని చెప్పాడు. ఈ వీడియోను తాను రాత్రి 2.30 గంటలకు చూశానని.. ఏడుస్తూ లోపలికి వెళ్లి చూసేసరికి అప్పటికే తన కొడుకు మరణించాడని వెంకటేశర్లు తెలిపాడు. ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందించకపోవటం వల్లే తన కొడుకు మరణించాడని ఆరోపించాడు.

(Video Source: TV9 Telugu Live)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Government Chest Hospital  Erragadda  coronavirus  covid patients  

Other Articles