Raghu Rama Krishnam Raju Pens A Letter For YS Jagan పార్టీ అధినేత, సీఎం జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ

Mp raghurama krishnam raju writes to cm ys jagan to brief over allegations on him

AP Police, Kishan Reddy, Rajnath singh, Rama Raju, VijaySai Reddy, General Secretary, Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP MP Raghurama Krishnam Raju has sent a six-page letter to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy over the latest developments. Prior to sending a letter to the chief minister, he released a song which says India will emerge victorious under Modi's rule in case if there is the war with China.

పార్టీ అధినేత, సీఎం జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ

Posted: 06/29/2020 10:31 PM IST
Mp raghurama krishnam raju writes to cm ys jagan to brief over allegations on him

వైసీపీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. తనకు ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేర్కోంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నుంచి ఇటీవల తనకు షోకాజ్ నోటీసు అందిందని పేర్కోన్నారు. అయితే షోకాజ్ నోటీసుపై స్పందిస్తూ తాను ఈ లేఖ రాశానని ఎంపీ తన లేఖలో వివరించారు. తాను ఎంపీగా గెలుపోందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా.. మరో పార్టీ లెటర్‌ హెడ్ తో నోటీసు వచ్చిందని తప్పుబట్టారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని భారత ఎన్నికల కమీషన్ పలు సందర్భాల్లో మన(వైఎస్సార్ కాంగ్రెస్) పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ఏ సందర్భంలోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. అయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం తాను ఎప్పుడూ విధేయుడినేనని చెప్పారు. రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలకు ఎలాంటి గాయం కాకూడదనే తాను తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం విషయమై స్పందించానని చెప్పారు. ఈ విషయంలో తన గళం వినిపించేనా కానీ.. పార్టీని కానీ, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కానీ తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు.

‘నేను వెంకటేశ్వరస్వామికి అపర భక్తుణ్ని. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను వివరించా. ఈ వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లు చెప్పా. నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. ఇసుక విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించా. ఈ ప్రయత్నం నెరవేరకే మరో మార్గం లేక మీడియా ముందుకు వెళ్లా. రాజ్యాంగానికి లోబడే నేను మాట్లాడా. మీపైనా, పార్టీపైనా నేనెక్కడా మాట్లాడలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. మీ చుట్టూ ఉన్న కొందరు నన్ను క్రైస్తవ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి మిమ్మల్ని కలవకుండా చేస్తున్నది వారే.’ అని రఘురామ కృష్ణ రాజు లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles