Maharashtra govt extends lockdown మహారాష్ట్రలో జూలై 31 వరకు లాక్ డౌన్ పోడగింపు

Maharashtra govt extends lockdown till july 31 restrictions to be re imposed in covid hotspots

maharashtra coronavirus, maharashtra covid, mumbai lockdown, pune lockdown, mumbai news, maharashtra lockdown, maharashtra lockdown extension, maharashtra lockdown end date, maharashtra lockdown relaxations, maharashtra lockdown status, maharashtra lockdown coronavirus, maharashtra lockdown latest

In view of the rising number of coronavirus cases in Maharashtra, the Uddhav Thackeray-led government announced that the ongoing lockdown in the state will be extended till July 31. The government also stated that restrictions on the non-essential activities and movement of people will be re-imposed in COVID-19 hotspots.

మహారాష్ట్రలో జూలై 31 వరకు లాక్ డౌన్ పోడగింపు

Posted: 06/29/2020 07:21 PM IST
Maharashtra govt extends lockdown till july 31 restrictions to be re imposed in covid hotspots

కరోనా కరాళనృత్యంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తుతున్నాయి. ఇటు దేశంలోనూ ఏకంగా రోజుకు ఇరవై వేల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు నాలుగు వందల వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయి, ఈ కేసుల్లో అధికంగా మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని శివసేన కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ ను జులై 31 వరకు పొడిగించింది. ఇవాళ మధ్యాహ్నం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘మిషన్ మళ్లీ మెదలు’ అంటూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ముంబై మెట్రో పాటిటన్ ప్రాంతంలో అత్యవసరాలు మినహా.. అన్ని ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. షాపింగ్, ఇతర ఔట్ డోర్ వ్యాయామాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతించనుంది.

అయితే.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. కొవిడ్-19 పోరులో పురోగతి ఉందని.. సంక్షోభం అప్పుడే ముగియలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలను ఆయన కోరారు. ముంబై మెట్రో పాలిటన్ నగరంలో అన్ని ప్రైవేట్ కార్యాలయాల్లో కనీసం 10 మంది లేదా 10 శాతం మందితో విధులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చునని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం 15 మంది లేదా 15 శాతం మందితో కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. వైద్య శాఖ, పోలీస్ శాఖ లాంటి అత్యవసర సేవలు అందించే శాఖల్లో పనిచేసే వారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చారు.

లాక్ డౌన్ నియమ నిబంధ‌న‌లు ఎలా ఉండాల‌నే విష‌యంలో స్థానిక ప‌రిస్థితుల‌ ఆధారంగా ఆయా జిల్లాల క‌లెక్టర్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు నిర్ణయం తీసుకుంటార‌ని మ‌హారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యవసరాలు, నిత్యావ‌సరాల‌కు సంబంధించిన అన్ని ర‌కాల వ్యాపార‌ కార్యకలాపాలు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని స్పష్టం చేసింది. అత్యవసం కానీ వాటిలో వేటిని అనుమ‌తించాలి, వేటిని అనుమతించ‌కూడ‌దు అనే విష‌యంలో స్థానిక అధికార యంత్రాంగమే నిర్ణయం తీసుకుంటుంద‌ని తెలిపింది. లాక్ డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో రాష్ట్రం మళ్లీ లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే అసోం, జార్ఖండ్ రాష్ట్రాలు లాక్ డౌన్‌ను పొడిగించాయి. అవసరమైతే హైదరాబాద్లోనూ లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ సర్కార్ సంకేతాలిచ్చింది. దీనిపై తుది నిర్ణయాన్ని క్యాబినెట్ భేటీలో తీసుకోనున్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఆది నుంచి కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కరోనా కట్టడి కోసం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఇక్కడ ప్రజల నుంచి వాటికి సహకారం లభించకపోవడంతో కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలో తొలి స్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కల్లోల్లం సృష్టిస్తోంది. ఢిల్లీ తర్వాత ముంబై నగరం రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా బారినపడి 7,429 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 86,575 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 70,622 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముంబైలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థితిలో ఉంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5493 కొత్త కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uddhav Thackeray  'Mission Begin Again'  Lockdown  Mumbai  Maharashtra  politics  

Other Articles