HCU promotes UGC and PG students without exams ఆ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పట్టాలు మరీ..

Hcu promotes ugc and pg students without exams

Hyderabad Central University, UGC Students, PG Students, Promote, Internal Marks, HCU, Corona Pandemic, covid-19

In the corona pandemic situation prevailed world wide after the telangana, and Andhra pradesh governments, now Hyderabad Central University too is running in its path, HCU has taken key decision to promote its UGC, and PG students without conducting exams hcu ug and pg courses, hcu promote without conducting exams, hcu promote ug pg final year students, Hyderabad Central University, UGC Students, PG Students, Promote, Internal Marks, HCU, Corona Pandemic, covid-19

హెచ్.సి.యు విద్యార్థులు ఫుల్ ఖుషీ.. పరీక్షలు లేకుండానే పట్టాలు మరీ..

Posted: 06/22/2020 06:45 PM IST
Hcu promotes ugc and pg students without exams

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ పదో తరగతి సహా పన్నెండవ తరగతి విద్యార్థులను కూడా ఉన్నత తరగతులకు ప్రమోట్ చేయడంతో ఇక ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల వంతు వచ్చింది. అయితే ఢగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ అవకాశాన్ని తొలుత ఇచ్చింది హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఔనా నిజమేనా అంటున్నారా..? ఇది నిజమేనండీ.. త్వరలోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు పరీక్షలు లేకుండా పట్టాలు అందుకోన్నారు. ఈ మేరకు యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ  గ్రేడ్ల విధానాన్ని ప్రవేశపెట్టి మెమోలు జారీ చేయనుంది.

అయితే తమ నిర్ణయంతో ఉన్నత చదువులు/ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ ప్రొపెసర్ పొదిలె అప్పారావు తెలిపారు. మార్కులలో తాము ఆచరించిన విధానం విద్యార్థుల కోర్సు మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని జరుగుతుందని అన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతానికి గత సెమిస్టర్లలోని మార్కుల ఆధారంగా సగటు తీశారు. మిగిలిన 50 శాతానికి ఇంటర్నల్‌ పరీక్షలు, అప్పటికే కేటాయించిన మార్కుల సగటు తీసి అందించారు. దీనివల్ల గత సెమిస్టర్లు, ఇంటర్నల్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి గ్రేడ్లు దక్కాయని విద్యార్థులు చెబుతున్నారు.

ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్ష ఏటా మే నెలలో జరగాల్సి ఉంది. కరోనా కారణంగా పరీక్షను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేశారు. అన్ లాక్ 2.0 వచ్చిన తరువాత దేశం యావత్తు యధాతధస్థితికి చేరుకున్న క్రమంలో ప్రవేశపరీక్షలు నిర్వహణపై అలోచిస్తామని అంటున్నాయి యూనివర్సిటీ వర్గాలు. హెచ్ సీ యూ ప్రవేశ పరీక్షలను జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించాల్సి ఉంటుందని తెలిపాయి. జులైలో దేశవ్యాప్తంగా పరిస్థితులు మెరుగవకపోతే ఆగస్టు మొదటివారంలో ప్రవేశ పరీక్ష జరగడం అనుమానమే. మరోపక్క బ్యాక్ లాగ్‌ విద్యార్థుల విషయంలో వస్తున్న విజ్ఞప్తుల గురించి చర్చించేందుకు పరీక్షల విభాగం అధికారులు విద్యార్థి సంఘం నేతలతో చర్చిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Central University  UGC Students  PG Students  Corona Pandemic  covid-19  

Other Articles