Cipla to sell anti-viral drug remdesivir as Cipremi in India కరోనా సీరియస్ రోగులకు సిప్లా సిప్రెమీని ఇంజక్షన్ రెడీ.. ఏడు డోసులే

Ciplas antiviral drug cipremi joins fabiflu covifor to treat covid 19 infection

Cipremi, Cipla's antiviral drug, Coronavirus Vaccine, Coronavirus Injection, Coronavirus, Glenmark Pharmaceuticals, Drugs Controller General, Baddi facility, active pharmaceutical ingredient, Himachal Pradesh, Favipiravir, multiple sclerosis, Covid-19 Infections, Union Health Ministry

Pharma major Cipla Ltd has announced the launch of its generic version of antiviral drug Remdesivir for emergency use in treatment of Covid-19 patients. The new drug will be sold under the brand name Cipremi. Cipla’s antiviral drug Cipremi is the latest to join Glenmark’s Fabiflu and Hetero’s Covifor to treat Covid-19 patients in the country.

కరోనా సీరియస్ రోగులకు సిప్లా సిప్రెమీని ఇంజక్షన్ రెడీ.. ఏడు డోసులే..

Posted: 06/22/2020 08:38 PM IST
Ciplas antiviral drug cipremi joins fabiflu covifor to treat covid 19 infection

ప్రపంచదేశాలను గత కొన్ని నెలలుగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించేందుకు కూడా కారణమైంది. ఇప్పటి వరకు దీనిని నోవల్ కరోనా వైరస్ దీనిని పిలివడానికి కారణం చికిత్సకు మందులు లేకపోవడమే. కానీ ఇప్పుడు గ్లెన్ మార్క్ తీసుకువచ్చిన ఫ్యాబిఫ్యూతో వైరస్ ప్రాథమిక, మధ్యమిక దశలో వున్న కరోనా రోగులను చికిత్స చేయవచ్చునని సంస్థ ప్రకటించింది. ఫవిపిరవిర్‌ అనే యాంటీ వైరస్‌ ఔషధంపై అధ్యయనం చేసిన గ్లెన్ మార్క్‌.. దీంతో కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. దీనిని ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతులను మంజూరు చేసింది.

ఇది వచ్చిన మరుసటి రోజునే హెటిరో డ్రగ్స్ సంస్థ కోవిఫర్ అనే ఇంజక్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కరోనా ప్రభావం అధికంగా వుండి.. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిన రోగులపై పనిచేస్తుందని తెలిపింది. ఇక హెటిరో తో పాటు కలసి పనిచేసిన మరో కంపెనీ సిప్లాకు కూడా ఈ మందును తయారు చేసి విక్రయించేందుకు భారత డగ్ర్ కంటోల్ బోర్డు అనుమతులు మంజూరు చేసింది. ఇది కూడా కోవిఫర్ మాదిరిగానే ఇంజక్షన్ మంది. ఇది కూడా సరిగ్గా కోవిఫర్ మందు తరహాలోనే పనిచేస్తంది. కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్న రోగులకు మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాల్సి వుంటుంది.

ఖరీదే కాదు.. డోసేజ్ కూడా ఏక్కువే !

 

గ్లెన్ మార్క్ తీసుకువచ్చిన ఫాబిఫ్లూ మాత్రలు కాసింత ఖరీదేనని చెప్పుకుంటున్న తరుణంలో హెటిరో డగ్ర్ తీసుకువచ్చిన ఇంజక్షన్ ఖరీదు మరీ ఎక్కువ. అదే సమయంలో సిప్లా తీసుకువచ్చిన ఇంజక్షన్ దర కూడా ఐదు వేల పైమాటే. ఇక దీనిని కరోనా ప్రభావం అధికంగా వున్న రోగులకు ఇచ్చే డోసేజ్ కూడా అధికంగానే వుంది. భారత ఔషధ నియంత్రణ మండలి సూచనల ప్రకారం ఏకంగా ఏడు ఇంజక్షన్లను వినియోగించాలి. తొలి రోజున ఉదయం సాయంకాలల్లో ఒకక్కటి.. ఆ తరువాత ఐదు రోజులకు ఐదు ఇంజక్షన్లను ఇవ్వాలని సూచించింది. దీంతో అధికంగా కరోనా బారిన రోగికి ఏకంగా 35 నుంచి 42 వేలు ఇంజక్షన్లకు ఖర్చుచేయాల్సి వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles