దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని నగరంలో ఉగ్రవాదులు దుశర్చలకు పాల్పడే అవకాశాలు వున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సహా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ మేరకు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్ నుంచి నలుగురు, ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు కుట్రపన్నుతూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తమ ముష్కరమూకలకు చెందిన ఉగ్రవాదులను పంపించాయన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
తీవ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీలోనికి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పరిధిలోని పదిహేను జిల్లాలలో హైఅలర్ట్ ప్రకటించారు. దీనికితోడు క్రైం బ్రాంచ్ పోలసీుల, స్పెషల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి అణువణువూ గాలిస్తున్నారు. దేశరాజధానిలో విధ్వంసం సృష్టించాలన్న కుట్రతో ఉగ్రవాదులు వచ్చే అవకాశముందని అన్నారు. ఢిల్లీ పోలీసులు అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాల సరిహద్దుల్లో విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో ఢిల్లీలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, గెస్ట్ హౌస్ లు, ఇతర ప్రదేశాల్లో భద్రతాచర్యలు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more