Petrol and Diesel price hiked by record price in 16 days వరుసగా పదహారవ రోజు బాదేసిన ఇం‘ధన’ సంస్థలు..

In 16 days petrol price nears rs 80 mark in delhi diesel rate touches new high

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

Petrol price on Monday was hiked by 33 paise per litre and diesel by 58 paise to take retail rates to record high as the oil companies increased prices for the 16th day in a row. In 16 days, petrol price has been hiked by Rs 8.3 per litre and diesel by Rs 9.46 - a record increase in rates of the fuel in any fortnight since pricing was deregulated in April 2002.

రికార్డు స్థాయిలో పెరిగిన ఇంధన ధరలు.. 2002 నుంచి ఇదే తొలిసారి..

Posted: 06/22/2020 01:23 PM IST
In 16 days petrol price nears rs 80 mark in delhi diesel rate touches new high

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పెరుగడంతో దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి. గత పక్షం రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరగాయి. వాహనదారుల జేబులను ఖాళీ చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్న ఇంధన సంస్థలు వరుసగా పదహారు రోజులుగా ఏకంగా డీజిల్ పై పది రూపాయల మేర, పెట్రోల్ పై ఎనమిన్నదర రూపాయల మేర ధరలను పెంచేశాయి. ఇక తాజాగా పదహారవ రోజన కూడా కేంద్రం ఇంధన సంస్థల పెంపును అనుమతిచింది. ఇవాళ లీటరు పెట్రోల్ పై 33 పైసలు, లీటరు డీజిల్ పై 58 పైసలు మేర ధరను పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇంధన ధరలపై కేంద్రం చేతులెత్తేసిన 2002 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏ పక్షం రోజుల్లోనూ ఇంతగా ఇంధన ధరలు పెరగలేదు. పక్షం రోజులకో పర్యాయం ఇంధన ధరల పెంపుపై కేంద్రంతో పాటు చమురు సంస్థలు భేటీ అయ్యి నిర్ణయం తీసుకునేవి. కానీ ప్రధాని మోడీ హాయంలో రోజువారీగా ఇంధన ధరలను పెంచుతూ వచ్చారు. అయితే రోజువారీగా ధరలను అంతర్జాతీయ మార్కెట్ కు అనుసంధానం చేస్తూ పెంచుతున్నా.. అక్కడ ధరలు తగ్గిన సమయంలో మాత్రం దేశంలో ఇంధన ధరలు తగ్గేవి మాత్రం కావు. ధరలు తగ్గిన క్రమంలో వాటి ఫలాలను ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రమో, లేక వ్యాట్ పేరుతో రాష్ట్రాల్లో లేక రవాణ చార్జీల పేరుతో ఇంధన సంస్థలో లబ్ది పోందుతున్నాయే తప్ప.. దేశంలోని వాహనదారులకు మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు.

దీంతో 2017 మే నెలలో ఇంధన ధరలపై పక్షం రోజులకో పర్యాయం ధరల పెంపు సమావేశాలను తొలగించిన కేంద్రం.. అప్పటి నుంచి రోజువారీగా ధరలను పెంచుతూ వస్తోంది. ఇక ఈ సమయాన్ని కూడా కలుపుకున్నా ఏ పక్షం రోజుల్లో లేని రికార్డు స్థాయి పెంపు ఈ వారం నమోదైంది. కరోనా మహమ్మారితో పోరాటం చేస్తూ కష్టకాలంలో వున్న ప్రజలకు రాయితీలు కల్పించాల్సిన ప్రభుత్వం.. ధరలను విపరీతంగా పెంచుతూ.. ఇంధనం అంటే కేవలం ధనమే అన్నట్లు పరిగణించడం వాహనదారులపై ధరఘాతం అధిక ప్రభావం చూపుతోంతి. గతంలో ఏ పక్షం రోజులు తీసుకున్నా.. రూ. 5 నుంచి ఆరు వరకు మాత్రమే ధరల పెంపు వుండింది. కానీ ప్రస్తుతం పదహారు రోజుల వ్యవధిలో గరిష్టంగా లీటరు పెట్రోల్ ధరపై ఏకంగా ఎనమిది రూపాయల ముఫై పైసలు.. లీటరు డీజిల్ పై తొమ్మిది రూపాయల 46 పైసల ధల పెరిగింది.

ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలోనే ఏకంగా ఎనబై రూపాయలకు ఎగబాకింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 79.56 చేరగా, లీటరు డీజిల్ ధర కూడా 79.23కు చేరింది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.27, డీజిల్ ధర రూ.74.14 గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.86.36, డీజిల్ ధర రూ.77.24గా ఉండగా, చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.82.87, డీజిల్ ధర రూ.76.30గా ఉంది. హైదారాబాదులో లీటరు పెట్రల్ దర ఏకంగా రూ.82.59 పైసలకు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.77.06 చేరింది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయావాడలో ఇంధన ధరలు కూడా పైకి ఎగబాకాయి. విజయవాడంలో లీటరు పెట్రోల్ ధర రూ.82.93కు చేరగా, లీటరు డీజిల్ ధర రూ.77.37కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles