SC calls for uniform fee for COVID-19 testing in India కరోనా పరీక్షలకు దేశవ్యాప్తంగా ఒకే ఫీజు నిర్ణయించండీ: సుప్రీంకోర్టు

Supreme court calls for uniform fee for covid 19 testing in india

Coronavirus, COVID-19, Supreme Court, India Coronavirus Testings, Uniform fee, union government, states uniform fees, corona testing fee, private labs corona testing fees, supreme court on uniform corona testing fee, Union Health Ministry

Taking a note of non-uniformity in Covid test rates, Supreme Court directed the Centre to ensure uniform rates and asked the states to set up a panel of experts for inspection of hospitals to ensure proper care of patients. A bench comprising Justices Ashok Bhushan, S K Kaul and M R Shah said that there should be uniformity in Covid testing charge in all states.

కరోనా పరీక్ష పీజులో రాష్ట్రాల మద్య వత్యాసమెందుకు.?: సుప్రీంకోర్టు

Posted: 06/20/2020 02:31 PM IST
Supreme court calls for uniform fee for covid 19 testing in india

కరోనా వైరస్‌ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు సంశయిస్తున్న ప్రజలకు ప్రైవేటు ల్యాబ్ ల ద్వారా కరోనా పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదేశాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ అనుమతులు పోందిన పలు ప్రైవేటు ల్యాబ్ లకు కరోనా నిర్థారణ పరీక్షలు జరుపుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ధరలను ప్రకటించింది, కోవిడ్ రోగులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా నిర్థారన పరీక్షలకు రూ.2200 పిక్స్ చేయగా, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 2900గా నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ధరలు తెలిసేలా మీడియా ముఖంగా ప్రకటించింది.

కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిర్ణయించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుబట్టింది. రాష్ట్రల మధ్య కరోనా పరీక్షలకు వత్యాసాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని కచ్చితమైన ధరను నిర్ణయించాలని ఆదేశించింది. కరోనా పరీక్షల ధరలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం లేకుండా, దేశవ్యాప్తంగా ఒకే ధర అమలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్‌ ఎస్‌.కె. కౌల్‌, జస్టిస్‌ ఎమ్‌ ఆర్‌ షాలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం తిసభ్య ధర్మాసనం అదేశించింది. కరోనా పరీక్షల నిర్వహణకు రాష్ట్రాల మధ్య వున్న వత్యాసాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.

దీంతో పాటు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల నిర్వహణ, బాధితులకు అందించే సేవలను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం పరిధిలోని అంశంపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన న్యాయస్థానం.. ఎంత ధరను వసూలు చేయాలనేది కోర్టు నిర్ణయించలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అలాగే రోగులకు అందించే చికిత్సను పర్యవేక్షించేందుకు ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్) కరోనా పరీక్షల కిట్ల ధరలు దిగిరావడంతో గతంలో నిర్ణయించిన రూ.4,500 ధరపై పరిమితులను ఎత్తివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles