JanaSena urges AP govt to waive off road tax, permit fee టాక్సీ యజమానులను వేధించడం సమంజసమా.?: పవన్ కల్యాణ్

Waive off road tax permit fee for struggling cab drivers pawan kalyan to ap govt

Pawan Kalyan, YSRCP Government, Taxi owners, Road Tax, Road Permit, covid-19, coronavirus, Public Transport, Maxi Cab, Taxi Seating Capacity, JanaSena, Twitter, Andhra Pradesh, Politics

The Pawan Kalyan-led Janasena party demanded that the Andhra Pradesh government waive off permit fee and road tax for taxi owners as many are struggling to repay their vehicle loans due to poor ridership during the lockdown.

టాక్సీ యజమానులను వేధించడం సమంజసమా.?: పవన్ కల్యాణ్

Posted: 06/20/2020 02:50 PM IST
Waive off road tax permit fee for struggling cab drivers pawan kalyan to ap govt

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా ఐదు విడతలగా విధించిన లాక్ డౌన్ తో ఇళ్లకు మాత్రమే పరిమితమైన ట్యాక్సీ యజమానులు ప్రభుత్వం ముందుకువచ్చి ఆదుకోవాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఐదు విడతలుగా ఏకంగా 70 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ తో చతికిలపడి.. అన్ లాక్.. 1.0తో మళ్లీ రోడ్డపైకి వచ్చినా.. ఎటు నుంచి కరోనా కాటు వేస్తుందో తెలియక ప్రజలు ట్యాక్సీలను బుక్ చేసుకోవడం కూడా మానేశారని, ఏదో అత్యవసర పరిస్థితుల్లో గత్యంతరం లేక మాత్రమే ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారని పవన్ కల్యాన్ పేర్కోన్నారు.

వ్యాపారాలు లేక ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న టాక్సీ యజమానులను ప్రభుత్వం భరోసా కల్పించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ క్రమంలో టాక్సీలకు పర్మిట్‌ ఫీజులు, రోడ్డు ట్యాక్సులు రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అపీల్ చేశారు. లాక్ డౌన్‌ మూలంగా దేశప్రజలందరితో పాటు ట్యాక్సీలు నడుపుకుని జీవనం సాగించేవారు కూడా కుటుంబపోషణ భారమైందని.. వారు కూడా ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారని పవన్ పేర్కొన్నారు. లాక్ డౌన్‌ ఉన్నంత కాలం వాహనాలు తిప్పే పరిస్థితి లేకపోయిందని, సడలింపులు ఇచ్చినా  ప్రయాణించేందుకు ప్యాసింజర్లు కరువయ్యారని ఆయన అవేధన వ్యక్తం చేశారు.

దీంతో ట్యాక్సీ యజమానులకు ఉపాధి అవకాశాలు నామమాత్రంగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన పవన్.. ఇందుకు ట్యాక్సీ యజమానుల నుంచి ఆర్టీఏ అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను మినహాయిస్తే చాలునని ఆయన సూచించారు. అసలే ఆర్థిక ఇబ్బందులలో చిక్కకున్న బడుగు జీవులపై రవాణశాఖ ఒత్తిడి చేయడం సమంజసమా.? అని పవన్‌ ప్రశ్నించారు. వీరి బాధలను సానుభూతితో రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, రోడ్లపై తిరగని వాహనాలకు లాక్ డౌన్‌ సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్‌ రద్దు చేయాలని కోరారు. అలాగే సీట్ల కుదింపు ఉన్నంత వరకూ పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  AP Government  Road Tax  Road Permit  JanaSena  Andhra Pradesh  Politics  

Other Articles