మెగా డాటర్, సినీనటుడు, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహవిషయమై నిన్న మీడియాలో వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే వరుడు ఎవరు అన్న విషయంలో మాత్రం కాసింత క్లారిటీ లోపించింది, అభిమానుల్లో మాత్రం ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి నెలకోంది. మెగా డాటర్ వరించనున్న వరుడు ఎవరు.? ఏం చేస్తుంటాడు.? సినిరంగానికి చెందినవాడేనా.? లేక మరెవరు.? ఏ సామాజిక వర్గానికి చెందినవాడు..? ఇలా అభిమానుల మదిలో అనేకానేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే చిరంజీవి సామాజిక వర్గానికే చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి.. ఐపీఎస్ అధికారి కుమారిడితో నిహారిక నిఖా పక్కా అయ్యిందని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది.
నిహారికకు కాబోయే వరుడు ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతమైన పోస్టులో అధికారిగా వ్యవహరిస్తున్నారని తెలుసుకన్నా.. అతడెలా వుంటాడు.. అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి, దీంతో నిహారిక తన ఫ్యాన్స్ ఆసక్తిని అర్థం చేసుకుని తనకు కాబోయే వరుడి ఫోటోను అభిమానులతో పంచుకుంది, ఆగస్టుతో ప్రారంభం కానున్న శ్రావణ మాసంలో ఈ జంట నిశ్చితార్థం చేయనున్నారని ఆ తరువాత వచ్చే వేసవిలో పెళ్లి ఖాయం చేసుకోవాలని.. ఇక ముహూర్తలన్ని నిశ్చితార్థం రోజునే పరిశీలిస్తారని సమాచారం. మిస్ నీహారిక అని ఉన్న క్యాప్షన్ కొట్టేసి.. మిసెస్ నీహారిక అని రాసిన ఫోటోతో ఆమె వివాహం ఖాయం అయిపోయిందని తెలిసిపోయింది.
అయితే, నిన్న నిహారిక షేర్ చేసిన ఫోటోలో వరుడి ముఖం కనిపించకుండా ఉండడం తో అభిమానులను సస్పెన్స్ గురిచేసింది. ఇక ఈరోజు తనకు కాబోయే వాడి ఫోటోలను అమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది. అంతేకాదండోయ్.. నిహారిక వరించిన వరుడు చైతన్య కూడా నిహారికతో తాను తీసుకున్న ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశాడు. ఇక సినీవర్గాలు జంట బాగుందని.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని.. కంగ్రాట్స్ అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక తెలుగు సినీఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా నిహారిక జంటకు శుభాకాంక్షలను తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more