SSC exams postponed in Telangana State హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా..

Ssc exams postponed in telangana state amid high court directions on ghmc

High Court of Telangana, Hyderabad, SSC exams, tenth students, telangana government, High Court, GHMC SSC Students, CM KCR, telangana, Politics

The State Government on Saturday decided to postponed all the SSC exams across the Telangana. In wake of High Court order not allowing SSC exams in GHMC limits, Chief Minister Telangana K Chandrasekhar Rao has taken a decision to postpone the exams forthwith till further orders.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా..

Posted: 06/06/2020 10:02 PM IST
Ssc exams postponed in telangana state amid high court directions on ghmc

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ లో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి కోరుతూ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో హైకోర్టు అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం సమర్పించే నివేదిక మేరకు ఈ విషయంలో తుది నిర్ణయాన్ని ఇవాళ ప్రకటిస్తామని చెప్పింది. దీంతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందని ఇటు విద్యార్థులతో పాటు అటు ప్రభుత్వంలోనూ కొనసాగుతోన్న ఉత్కంఠకు న్యాయస్థానం తెరదించింది. దీంతో గత రెండు రోజులుగా ఈ విషయంలో కోనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

అయితే కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంఘంలో మాత్రం విద్యార్థులకు పరీక్షల నుంచి మినహాయింపు కల్పించింది. నగరంలో కరోనా శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా పిల్లలందరికీ సోమవారం నుండి పరీక్షలు జరగనున్నాయి. గ్రేటర్ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అదేశించింది. వీటితో పాటు కొన్ని కీలక నిర్ణయాలు కూడా వెలువరించింది. 

అయితే జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు  తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరగా, కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు ? ఆ బాధ్యత ఎవరు  తీసుకుంటారు? అని ప్రశ్నించింది హైకోర్టు. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమన్న హైకోర్టు, పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్ మెంట్ గా మారితే ఏంచేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెహ్ఎంసీ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పది రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలని హైకోర్టు ఆదేశించింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ తదుపరి  విచారణ 19 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court of Telangana  Hyderabad  SSC exams  GHMC  Politics  

Other Articles