Dawood Ibrahim Dies Due to Coronavirus! కరోనా కాటుకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ హతం

Dawood ibrahim died due to covid 19 rumors going viral on social media

Dawood Ibrahim, most wanted terrorist dawood ibrahim, underground terrorist dawood ibrahim, dawood ibrahim died, dawood ibrahim death, dawood ibrahim coronavirus, dawood ibrahim COVID-19, dawood ibrahim Rumors, dawood ibrahim viral news, dawood ibrahim social media

Dawood Ibrahim one of the most wanted underground terrorists in the world. Now the news about hisdeath was going viral in India. Most of the people raising questions about his death whether it is natural or due to Coronavirus.

కరోనా కాటుకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ హతం

Posted: 06/06/2020 10:10 PM IST
Dawood ibrahim died due to covid 19 rumors going viral on social media

భారత మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన ఓ వార్త అటు సోషల్ మీడియాతో పాటు ఇటు దేశీయ మీడియా సంస్థల్లోనూ హల్ చల్ చేస్తోంది. వెయ్యి గొడ్లను తిన్న రాబంధు చిన్న గాలివానకు చచ్చినట్లు.. అన్న నానుడిలా.. పాకిస్థాన్ టెర్రరిస్టు కార్యాకలాపాలు, ముంభై పేలుళ్లుకు బాధ్యుడైన దావూద్.. ఆ తరువాత దాయాధి దేశానికి వెళ్లి అక్కడే కొన్ని దశాబ్దాలుగా తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్యే ఆయన వయస్సు మీదపడి తద్వారా వచ్చే రుగ్మతల నేపథ్యంలో మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పాకిస్తాన్ లోని అతని వర్గాలు తోసిపుచ్చాయి. కాగా ఇప్పుడు తాజాగా మరోమారు ఆలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.

కరోన వైరస్ బారినపడి దావూద్ మరణించారనే వార్తలు గుప్పుమన్నాయి.. ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన దావూద్ ఇబ్రహీం... కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనే వార్తలు శుక్రవారం సాయంత్రం చక్కర్లు కొట్టాయి... అయితే, అతని సోదరుడు టాప్ డాన్ మరియు అతని భార్య ఇద్దరికీ కరోనావైరస్ లేదని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో దావూద్ మరియు అతని భార్యను కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.. అయితే, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం మాట్లాడుతూ, దావూద్‌కు, అతని కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ కరోనా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు.. వారందరూ తమ ఇంట్లో ఉన్నారని కూడా చెప్పారు.

మరోవైపు.. దావూద్ సిబ్బందిని కూడా నిర్బంధంలో ఉంచినట్లు ముందే వార్తలు వచ్చాయి... ఇంతలో, ఇవాళ ఉదయం కరోనా వైరస్ తో పాకిస్థాన్ లో దావూద్ మరణించాడని కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారానికి తెరలేపాయి. ఇక, ప్రముఖ భారతీయ టీవీ ఛానెల్ న్యూస్ ఎక్స్‌ కూడా.. దావూద్ ఇబ్రహీం కరోనాతో కరాచీలో మృతిచెందినట్టు ట్వీట్‌ చేసింది... నిజం ఏంటి? అనేదానిపై క్లారిటీ లేనప్పట్టికీ దావూద్ మృతిచెందారనే వార్త మాత్రం హల్‌చల్ చేస్తోది... ఇక,  భారత్ సహా ఎవ్వరూ చేయలేని పని కరోనా చేసిందనే కామెంట్లు కూడా పెడుతున్నారు. అంతేకాదు రాబంధు గాలివాన అన్నే కామెంట్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles