BJP Leader thrashes govt official with slipper ప్రభుత్వ అధికారిని చెపుతో కొట్టిన బీజేపి నేత..

Bjps tiktok star sonali phogat hits official with slipper

sonali phogat, tik tok star, cross firs, BJP leader, social media, government official, Hissar market secretary, Adampur, MLA Kuldeep Bishnoi, congress, Haryana, politics

A video of Tiktok star and BJP leader Sonali Phogat slapped a government official and then thrashing him with a slipper in public view accusing him for derogatory language against her, went viral on social media.

ప్రభుత్వ అధికారిని చెపుతో కొట్టిన బీజేపి నేత..

Posted: 06/06/2020 09:18 PM IST
Bjps tiktok star sonali phogat hits official with slipper

బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సొనాలి ఫోగట్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఓటమికి ఈ ప్రభుత్వ అధికారి కూడా కారణమని భావించిన ఆమె మందీమార్భలాన్ని వెంటబెట్టుకుని వెళ్లి.. ఓ ప్రభుత్వ అధికారిపై స్థానికులందరూ చూస్తుండగా.. చెంప చెల్లుమనిపించి అవమానించింది. అంతటితో ఆగని అమె సదరు ఉద్యోగి అమెతో పాటు అమె అనుచరుల నుంచి తప్పించుకుని స్థానికంగా వున్న ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కోగా.. పట్టుకుని అక్కడే చెప్పుతో కోట్టింది. ఇంతా చేసిన తరువాత కూడా ఆమెకు కోపం తగ్గలేదో.. లేక ప్రభుత్వ ఉద్యోగి తనపై కేసు పెడతారని ముందే ఊహించిందో కానీ.. సదరు అధికారిపై అమె పోలీసులకు కూడా పిర్యాదుచేసింది.

నాలుగు గోడల మధ్య చెంప దెబ్బ పడగానే వారి నుంచి ప్రాణహాని వుందని భావించిన ప్రభుత్వ అధికారు తప్పించుకుని పారిపోగా.. పట్టుకుని ఏకంగా చెప్పు తీసుకొని ఆయన్ను ఇష్టానుసారం కొట్టారు. అమెతో పాటు అమె అనుచరగణం కూడా ప్రభుత్వ అధికారిపై విఛక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్‌ జిల్లాలోని బల్సామండ్ మండి వద్ద జరిగింది. ఈ ఘటనకు పాల్పడింది మాత్రం టిక్ టాక్ స్టార్ గా పేరొందిన బీజేపి నేతసొనాలి ఫోగట్. అదామ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె గత ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అయితే అమె ఓటమికి పరోక్షంగా సదరు ప్రభుత్వ అధికారి కూడా కారణమని భావించిన ఆమె ఏకంగా అతను విధులు నిర్వహించే బల్సామండ్ మండికి రైతులతో కలిసి వెళ్లారు. మార్కెట్ కమిటీ అధికారులపై ఫిర్యాదులు రావడంతో వారితో మాట్లాడేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో సొనాలి ఫోగట్‌పై మార్కెట్ కమిటీ ఉద్యోగి సుల్తాన్ అసభ్య కామెంట్లు చేసినట్లు తెలిసింది.

దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సొనాలి.. ఆయనపై చెప్పులతో దాడి చేశారు. వద్దు మేడం.. అంటున్నా వినకుండా ఎడా పెడా వాయించారు. నీకు బతికే హక్కు కూడా లేదంటూ మండిపడ్డారు. అక్కడే పోలీసులు ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది సొనాలి ఫోగట్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, సొనాలి ఫోగట్‌పై సోషల్‌ మీడియాలో భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కొందరు ఆమె చేసింది సరైన పనేనంటూ సపోర్ట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం.. ఓ నేత ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. ఇక ఆదామ్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ మాత్రం ఇది చట్టవ్యతిరేకమని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles