Pak court issues notice to Imran Khan పాకిస్థాన్ ప్రధానికి పరువునష్టం తాకీదులు..

Pakistan pm imran khan gets court notice in defamation case

Pak PM, Imran Khan, Shahbaz Sharif, defamation case, Panama Papers, Supreme Court, Bribe, Additional district and sessions court, court notice, Pakistan, Politics

An additional district and sessions court here issued notices to Pakistan Prime Minister Imran Khan on an application, moved by opposition leader Shahbaz Sharif seeking early hearing of his Rs 10 billion suit for damages under Defamation Ordinance, 2002.

పాకిస్థాన్ ప్రధానికి పరువునష్టం తాకీదులు.. వాదన వినిపించాల్సిందేనన్న కోర్టు..

Posted: 06/06/2020 09:12 PM IST
Pakistan pm imran khan gets court notice in defamation case

పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మెడకు చుట్టుకుంది. పాకిస్తాన్ లోని ఓ న్యాయస్థానం ఇవాళ ఆయనకు ఈ వ్యవహరానికి సంబంధించిన కేసు నిమిత్తమై విషయంలో నోటీసలు జారీ చేసింది. 2017లో తమ పరువుకు భంగం కలిగించారన్న పిటీషనర్ వేసిన కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శ్రీముఖాలు జారీ చేసింది. ఈ మేరకు నోటీసులు అందాయని ఆయన కార్యాలయవర్గాలు స్పష్టంచేశాయి. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధ్యక్షుడు షహ్ బాజ్‌ షరీఫ్‌ ఈ కేసు నమోదు చేశార.

గత ఎన్నికలకు ముందు ఇమ్రాన్‌ ఖాన్ ఓ సభలో మాట్లాడుతూ.. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్‌ షరీప్ పై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని కోరారని వెల్లడించారు. అందుకోసం నవాజ్ షరీష్ సోదరుడు షహ్ బాజ్‌ తనకు 61 మిలియన్‌ డాలర్లను లంచంగా ఇచ్చేందుకు కూడా సన్నధమయ్యాడని అరోపించారు. అయితే ఈ అరోపణలు సత్యదూరమని షహ్ బాజ్ అన్నారు. అసలే ఎన్నికల సమయంలో అందులోనూ నవాజ్ షరీప్ పై దినపత్రికల్లో కథనాలు, పనామా పేపర్లలో కుంభకోణాలు వెలుగు చూడడంతో ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది.

దీంతో తానుకు ఏ మాత్రం సంబంధం లేని విషయంలోకి లాగి ఇమ్రాన్ ఖాన్ తెలివిగా లబ్దిచేసుకున్నారని.. ఈ విషయంలో తనకు జరిగిన పరువు నష్టంపై పోరాటం చేయడం ప్రారంభించారు షహ్ బాజ్.. ఇందులో భాగంగా కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానం 60 సార్లు వాదనలు వినగా 33 సార్లు వాయిదాలతోజజ పలుమార్లు తన న్యాయవాదులతో కోర్టుకు వాదనలు వినిపించిన ఇమ్రాన్.. స్వయంగాకానీ, రాతపూర్వకంగా కానీ సమాధానం చెప్పలేదు. దీంతో ఈసారి తప్పకుండా కోర్టుకు లిఖితపూర్వక సమాధానం చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ సమాధానమివ్వని పక్షంలో అధికరణ 62, 63 ప్రకారం ప్రధాని పదవికి అనర్హులవుతారని విపక్ష నేతలు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pak PM  Imran Khan  Shahbaz Sharif  defamation case  Panama Papers  court notice  Pakistan  Politics  

Other Articles