Did AP Government Become Bankrupt?: HIgh Court భక్తుల విరాళాలను వేలం వేయడంపై ఏపీ హైకోర్టులో పిల్

Did andhra pradesh government become bankrupt high court

AP High Court, ttd, tirumala, tirupati, ttd online, tirumala temple, ttd properties auction, AP government, YSRCP Govt, TTD properties, TTD Properties sale, devotees, Public Interest Litigation, AP Government, TTD News, andhra pradesh, Politics

AP High Court has made serious comments on the State Government while hearing to the petition against the sale of Government lands as a part of the Jagan Reddy Government’s Build AP mission. The Court found fault with the Government’s attitude of making funds by selling Government lands.

శ్రీవారి ఆస్తులపైనే ఏపీ ప్రభుత్వం ఆధారపడి వుందా.?: హైకోర్టు ప్రశ్న

Posted: 05/27/2020 12:58 AM IST
Did andhra pradesh government become bankrupt high court

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించిన ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ కమిటీ నిర్ణయం తీసుకోవడం పెను వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తుండగా, స్వయంగా టీటీడీ బోర్డు సభ్యుడు కూడా అందుకు వ్యతిరేక గళాన్ని వినిపించాడు. దీంతో బెట్టువీడి.. మెట్టుదిగిన టీటీడీ ఆలయ కమిటీ శ్రీవారి ఆస్తులను వేలం వేయాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పాటు టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడి ఆస్తులను వేలం వేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ నేత జంగటి అమర్ నాథ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజాప్రయోజన వాజ్యాన్ని వేశారు. దీంతో తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై ఏపీ హైకోర్టుకు చేరింది. అమర్ నాథ్ దాఖలు చేసిన పిటీషన్ లో పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. 2016లో అప్పటి టీటీడీ బోర్డు తీర్మానించిన 50 ఆస్తులను వేలం వేయకుండా మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆపిందని.. ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత బోర్డు వేలం వేయాలని గుర్తించిన 23 ఆస్తుల అర్రాసు ప్రక్రియను మాత్రమే ఆపలేదని అమర్ నాథ్ తన పిల్ లో పేర్కోన్నారు. ఆ పక్రియను కూడా నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దేవదేవుడికి భక్తులు ఎంతో భక్తిప్రవత్తుతలతో సమర్పించిన ఆస్తులను భవిష్యత్తులోనూ ఎవరూ వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. కాగా, ఈ పిల్ పై విచారణ సందర్భంగా ఏపీకి విస్తారమైన సముద్రతీరం వుందని, అయినా ప్రభుత్వం కేవలం దేవుడికి చెందిన ఆస్తులను విక్రయించే పాలన ఖర్చులను ఎందుకు రాబట్టాలని భావిస్తోందని ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బిల్డ్ ఏపీ మిషన్ లో భాగంగా ప్రభుత్వ భూములను విక్రయించాలని పిటిషన్ పై విచారణ జరుపుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా నిధులు సంపాదించాలనే ప్రభుత్వ వైఖరితో కోర్టు తప్పుబట్టింది. " వెయి కిలోమీటర్లు సముద్ర తీరం వున్నా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ధనవంతులుగా వుండగా, రాష్ట్రం ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా అణగారిపోయిందా.? దానిని సమృద్ది చేయాలంటే దేవుడి మాన్యాలనే విక్రయించాలా.. ఇలాగే రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్తారా.? ప్రభుత్వం దివాళా తీసిందా? ”అని హైకోర్టు ప్రశ్నించింది.

లాక్ డౌన్ సమయంలో ఇలా భగవంతుడి ఆస్తులను వేలం ద్వారా అమ్మడం ఎంతవరకు అర్ధవంతం? ఒక ప్రభుత్వం ఆలయాలకు చెందిన భూములను పరిరక్షించాలి కానీ ఇలా విక్రయించాలని చూడకూడదని న్యాయస్థానం తెలిపింది. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది ఈ కేసులో ప్రభుత్వ ప్రతిస్పందనను దాఖలు చేయడానికి ఎక్కువ సమయం కోరారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేలం యొక్క తదుపరి చర్యలు పాటించాలని ప్రభుత్వానికి సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles