Trolling Of Judges: HC Serves Notices ఎంపీ సహా 49 వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

High court issues notice to 49 members including ycp mp nandigam suresh

AP High Court, suo motu, notices, negative comments, judgements, Bapatla MP, Nandigam Suresh, Amanchi Krishna Mohan, Andhra Pradesh, Politics

Andhra Pradesh high court took suo motu cognizance of the adverse comments made against the judges and served notices on as many as 49 netizens who trolled the high court in the social media. The high court also served notices on YSR Congress party MP from Bapatla Nandigam Suresh and former MLA from Chirala Amanchi Krishna Mohan for making negative comments against the judgements.

కోర్టు తీర్పులను చులకన చేసిన 49 వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

Posted: 05/27/2020 12:56 AM IST
High court issues notice to 49 members including ycp mp nandigam suresh

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు తీర్పులను వెలువరించిన నేపథ్యంలో కోర్ఠు ధిక్కారానికి పాల్పడి ఏకంగా రాష్టోన్నత న్యాయస్థానం హైకోర్టుకు, హైకోర్టు న్యాయమూర్తులకు అఫఖ్యాతి చేకూరేలా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం చర్యలకు కూడా ఉపక్రమించింది. ఈ తరహాలో విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో ఏకంగా 49 మంది అధికార పార్టీ నేతలకు నోటీసులను జారీ చేసింది.

రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి తాఖీదులు అందుకున్న వైసీపీ నేతల జాబితాలో ఛట్టసభలకు ఎంపికైన నేతలు కూడా వున్నారు. పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జడ్జిలను కించపరిచారంటూ వీరిపై ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. దీంతో దానిని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యవహారంలో ప్రమేయమున్న 49మందికి నోటీసులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులపై వారు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు పరిశీలించింది. కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టింది. హైకోర్టు జడ్జీలను కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు పలువురు వైసీపీ నేతలు కోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుబట్టే విధంగా మాట్లాడారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ఏపీ హైకోర్టు... 49 మందికి నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది లక్ష్మీ నారాయణ... వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles