HC Upset With Less Corona Tests In Telangana తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆసహనం..

Hc raps telangana govt for conducting only 545 covid 19 tests per million people

High Court, Coronavirus, Covid-19 tests, Hyderabad, opposition parties allegations, corona symptoms, corona treatment, telangana corona tests, telangana corona cases, telangana corona deaths, coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana, Politics

With fewer positive coronavirus cases in Telangana compared to other states, the Telangana High Court on Tuesday reprimanded the state government and directed it to conduct more tests to avoid possible fatalities in the future.

తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆసహనం.. నివేదిక సమర్పించాలని అదేశం

Posted: 05/27/2020 04:06 AM IST
Hc raps telangana govt for conducting only 545 covid 19 tests per million people

తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణపై విపక్షాల విమర్శలు మిన్నంటాయి. అయితే తాము తమ సొంతంగా ఏదీ చేయడం లేదని, భారత ప్రభుత్వం సహా ఐసీఎంఆర్ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయినా ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. కరోనా పరీక్షలు చేయకుండా.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. కరోనాతో అసుపత్రులలో చేరి మరణించిన వారి మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. లక్షణాలు లేని హైరిస్క్ ఉన్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ పరీక్షలు చేస్తున్నారని నిలదీసింది. రాష్ట్రంలో మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల వివరాలను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది హైకోర్టు.

అంతేకాదు పీపీఈ కిట్లను ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో చెప్పాలని సూచించింది. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం రాసిన రెండు లేఖలను కూడా అందజేయాలని స్పష్టం చేసింది. జూన్ 4 లోగా పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కాగా, సోమవారం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకాం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1920 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,284 మంది కోలుకోగా.. 57 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 650 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles