A quiet Ramzan in Hyderabad after 112 years శతాబ్దానికి ముందు.. మళ్లీ ఇప్పుడు.. రంజాన్ పండుగ ఇలా..

Hyderabad lacks ramadan sheen after 112 years

Hyderabad, Ramadan, Ramzan IN HYDERABAD, lockdown in hyderabad, Hyderabad Ramzan, coronavirus cases in hyderabad, Hyderabad, Ramzan, coronavirus, cgvid-19, musi river, floods, lockdown, ramzan prayers, hyderabad, telanagana, Politics

Ramzan 2020, being somberly celebrated in Hyderabad clouded by Covid-19 lockdown, has all the trappings of Ramzan 1908, when a devastating deluge of river Musi left a trail of death and destruction in the city.

శతాబ్దానికి ముందు.. మళ్లీ ఇప్పుడు.. రంజాన్ పండుగ ఇలా..

Posted: 05/25/2020 01:35 PM IST
Hyderabad lacks ramadan sheen after 112 years

మహ్మదీయుల పవిత్ర పర్వదినాలలో రంజాన్ పండుగ ఒకటి. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. మహ్మదీయ సోదరులు ప్రతీ రోజు ఉపవాస దీక్షలు చేస్తూ.. అత్యంత పవిత్రంగా వుంటారు. ప్రతీ రోజు మసీదులకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇక ప్రత్యేకంగా చెప్పకోవాల్సిన ప్రాంతం చార్మినార్. దాంతో పాటు పాతబస్తీ.. ఈపండుగ పర్వదినాలలో ఈ రెండు ప్రాంతాలు కొత్తరూపును సంతరించుకుంటాయి. రంజాన్ నెల ప్రారంభమైన నాటి నుంచి మహ్మదీయ సోదరుల ఇళ్లలో కొత్తశోభ సంతరించుకుంటుంది. ఇక సరిగ్గా పండుగకు పక్షం రోజుల ముందు నుంచి చార్మినార్ లోని చుడీ బజార్ సహా అక్కడి ప్రాంతాలన్నీ సరికొత్త సందడితో కళకళలాడుతుంటాయి.

అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు అంతా బోసిపోతోంది. ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పండుగ పర్వదినం రోజున తమవారితో సరదగా గడపుకోలేని పరిస్థితి.. ఎంతలా అంటే కనీసం ఈద్ శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేనంతగా మారిపోయింది. ఇంట్లోనే ప్రార్థనలు.. కనీసం మసీదులకు వెళ్థామన్నా ధైర్యం సరిపోని పరిస్థితి. ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ తరం వారే కాకుండా కనీసం మూడు తరాల వారు కూడా ఎప్పుడూ చూడని దారుణమైన పరిస్థితుల్లో రంజాన్ పండుగను హైదరాబాదీలు జరుపుకుంటున్నారు. అయితే శతాధిక వృధ్దుల చెప్పడంతోనే లేక చారిత్రక సాక్షలతోనే ఇలాంటి పరిస్థితి గతంలోనూ ఒక పర్యాయం వచ్చిందని తెలుస్తోంది.

దేశ స్వతంత్ర్యానికి పూర్వం.. శతాబ్ద పుష్కర కాలానికి ముందు అంటే సరిగ్గా 112 ఏళ్లకు ముందు అప్పటి రంజాన్ పండగ పర్యదినం కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా అప్పటి వారు జరుపుకున్నారు. అదేంటి అప్పుడు కూడా కరోనా వచ్చిందా.? అంటే లేదు. కానీ హైదరాబాద్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాల వాసులకు ప్రాణాధారమైన మూసీ నదికి వరదలు రావడంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా హంగూ ఆర్భాటం లేకుండా రంజాన్ ను జరుపుకున్నారు. 1908లో సెప్టెంబరులో మూసీ వరదలు వచ్చాయి. దాదాపు 17 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ వంతెనలు తెగిపోయాయి.

ఈ వరదల ధాటికి దాదాపు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేల మట్టమయ్యాయి. మూసీ వరద బీభత్సానికి అఫ్జల్‌గంజ్‌ ప్రభుత్వాస్పత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం ఎనిమిది వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. అదే వరద బీభత్సం సృష్టించిన సమయంలో రంజాన్ పండుగ వచ్చింది. దీంతో వరదలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. రంజాన్ నెల ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాలేదు. దాంతో.. పండుగ సంబురాలను పక్కనబెట్టి ఆ డబ్బును వరద బాధితులకు అందజేశారు. అది జరిగి ఇప్పటికి 112 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దెబ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడప దాటి బయటికి రావట్లేదు. ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Ramzan  coronavirus  cgvid-19  musi river  floods  lockdown  ramzan prayers  hyderabad  telanagana  politics  

Other Articles