Coronavirus Cases In India Cross 1-Lakh Mark దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 5611 కొత్త కేసులు

Coronavirus update highest single day spike in covid 19 cases tally reaches 1 06 lakh

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The number of daily coronavirus cases hit a new high as India reported 5,611 new cases in the last 24 hours. The total number of coronavirus patients in India rose to 1,06,750. Death toll has increased to 3,303 after 140 patients passed away on Tuesday. The fatality rate in India is relatively low at 3%. Maharashtra saw 76 fatalities in last 24 hours, the highest in a single day.

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 5611 కొత్త కేసులు

Posted: 05/20/2020 10:09 AM IST
Coronavirus update highest single day spike in covid 19 cases tally reaches 1 06 lakh

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన 111 రోజులకు లక్ష మార్కును చేరిన కరోనా కేసులు 112వ  రోజునే వేగంగా వ్యాప్తించెందాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా భారత్ నిలవడం అందోళన రేకెత్తుతోంది. దేశంలో ఏకంగా సగటున రోజుకు ఐదు వేల మందికి వైరస్ వ్యాప్తి చెందగా, గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదు వేలకు మించిన కరోనా కేసులు నమోదు కాడడటం అందోళన కలిగిస్తోంది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 5611 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,06,750 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 140 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 3303కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా 76 మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.

గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 42,298 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 61,149 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 39 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.

దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 2000 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 37,136 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజునే రాస్ట్రంలో 76 మంది మరణించారు. దీంతో మొత్తంగా 1325 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ నిన్న ఒక్క రోజునే 395 కేసులు నమోదుకాగా, మొత్తం 12140 కేసులు నమోదు కాగా, 719 మంది కరోనాబారిన పడి మరణించారు.

తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మొత్తం కేసులు సంఖ్య 12448కు చేరగా, నిన్న ఒక్కరోజునే 688 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 500 మొత్తం కరోనా కేసులు 10554కు చేరగా, 160 మరణాలు నమోదయ్యాయి, ఆ తరువాత మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 5465 కేసులు నమోదు కాగా, 248 మంది మరణించారు, పశ్చమ బెంగాల్ లో  2961 కేసులు నమోదు కాగా, 238 మంది మరణించారు. ఇక రాజస్థాన్ లో 5845 కేసులు నమోదు కాగా మొత్తం 131 మరణాలు సంభవించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh