Tension arose at LG polymers as locals protest against company ఎల్జీ పాలిమర్స్ వద్ద టెన్షన్.. టెన్షన్.. స్థానికుల అందోళన..

Sc refuses to interfere with ngt order directing lg polymers to deposit rs 50 cr

RR Venkatapuram, Visakha Gas Leak, Supreme Court, LG Polymers, Vizag Gas Leak, visakha gas tragedy, NGT order, Locals, Protest, Andhra Pradesh

The Supreme Court on Tuesday refused to immediately interfere with a National Green Tribunal order directing LG Polymers to deposit Rs 50 crores for damage caused by a gas leak in Visakhapatnam, in which at least 12 people were killed.

ఎల్జీ పాలిమర్స్ వద్ద టెన్షన్.. టెన్షన్.. స్థానికుల అందోళన..

Posted: 05/19/2020 07:31 PM IST
Sc refuses to interfere with ngt order directing lg polymers to deposit rs 50 cr

విశాఖ జిల్లా గ్యాస్ లీక్ ఘటనతో ఆర్.ఆర్‌.వెంకటాపురం సహా ఐదు గ్రామాల ప్రజలను అతలాకుతలం చేసిన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిశ్రమ వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వెంకటాపురం వాసులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఎలాంటి వసతులు అందించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకు వసతులు కల్పిస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న వెంకటాపురం గ్రామవాసులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

స్టైరీన్‌ విషవాయువు ప్రభావిత గ్రామాల్లో ఆర్.ఆర్‌.వెంకటాపురం కూడా ఉందని.. ఈ విషయమై ఎలాంటి పుకార్లు నమ్మకూడదంటూ పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పడంతో వారు వెనుదిరిగారు. కాగా, తమ ఆరోగ్యాలపై స్టైరీన్‌ విషవాయువు ప్రభావం ఏవిధంగా ఉండనుందో తెలియదని పలువురు గ్రామస్థులు వాపోయారు. తమకు పరిహారం ముఖ్యం కాదని.. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడేలా న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక గ్యాస్ లీకై 12 మంది మృత్యువాత పడిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై మొత్తం 7 విచారణ కమిటీలు వేశారని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది తెలిపారు. ఎన్జీటీ సహా రాష్ట్ర హైకోర్టు, ఎన్ హెచ్ఆర్ సీ, ఎన్ పీసీబీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీలు ఏర్పాటయ్యాయని వివరించారు. మే 7న ఘటన జరిగిందని, ఆ మరుసటి రోజే కమిటీలు వేశారని వెల్లడించారు. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేశామని, అంతకుమించి ఎన్జీటీకి విచారణ అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. వాదనలు విన్న జస్టిస్ లలిత్ ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. అంతేగాకుండా, విచారణాధికారం అంశంపై ఎన్జీటీలో లేవనెత్తే అవకాశాన్ని ఎల్జీ పాలిమర్స్ కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles