Lockdown 4.0: Government Announced Guidelines For Offices కార్యాలయాలకు కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..

No need to shut entire office building if one or two coronavirus cases found mhfw

Health Ministry, workplace guidelines,offices, shut down, Coronavirus, COVID-19

As India entered the fourth phase of its nationwide lockdown with relaxations and offices and working places opening, the Union Ministry of Health and Family Welfare has issued guidelines on preventive and response measures to contain the spread of COVID-19 in workplace settings.

కార్యాలయాలకు కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..

Posted: 05/19/2020 06:35 PM IST
No need to shut entire office building if one or two coronavirus cases found mhfw

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో కేంద్రం ప్రకటించిన నాలుగో విడత లాక్ డౌన్‌ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. ఆర్థిక కార్యకలపాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా పలు కార్యాలయాలు తెరుచుకొనేందుకు అనుమతిచ్చింది. నూటికి నూరుశాతం మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు కూడా కేంద్రం అనుమతులను మంజూరు చేసింది. ఇక వర్క్ ప్రం హోం అవకాశం ఇవ్వదలచిన కార్యాలయాలు వాటిని కోనసాగించవచ్చునని కూడా అదేశాలు జారీ చేసింది. ఇక పూర్తిస్థాయిలో ప్రభుత్వ/ ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఒకటి లేదా రెండు కేసులు వస్తే మొత్తం కార్యాలయాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయా కార్యాలయాలను శానిటైజేషన్‌ చేయాలని సూచించింది. ఒకవేళ భారీ సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం మొత్తం భవనాన్ని 48గంటల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఆ కార్యాలయ భవనాలను శానిటైజ్‌ చేసి ఇక సిబ్బందిని అనుమతించవచ్చు అని చెప్పేవరకు అందరూ ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనబడితే వాళ్లు ఆఫీస్‌కు వెళ్లకుండా వైద్యుల్ని సంప్రదించేలా చూడాలంది. ఒకవేళ కరోనాగా అనుమానం ఉన్నా.. నిర్ధారణ అయినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం తెలపాలని సూచించింది.  

కంటైన్‌మెంట్‌ జోన్‌లలో హోం క్వారంటైన్‌లో ఉన్న సిబ్బంది అడిగితే వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.  సమావేశాల నిర్వహణ, సందర్శకులను సమన్వయం చేయడం వంటి విషయాల్లో సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) మార్గదర్శకాలను చాలా జాగ్రత్తగా పాటించాలని సూచించింది. కార్యాలయాల్లో కారిడార్లు, ఎలివేటర్లు, మెట్లు, క్యాంటీన్‌, సమావేశ గదులు, కాన్ఫరెన్స్‌ హాళ్లలో దగ్గరగా మెలిగే అవకాశం ఉన్నందున వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా అనుమానిత కేసు ఉంటే సమర్థంగా స్పందించాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health Ministry  workplace guidelines  offices  shut down  Coronavirus  COVID-19  

Other Articles