Hyderabad: Leopard scare grips Himayatsagar మైలార్దేవ్ పల్లిలో రెస్ట్.. హిమాయత్ సాగర్లో థస్ట్.. చిరుత ఎక్కడ..

Leopard venturing on hyderabad outskirts evades forest authorities

leopard, himayath sagar, Reservoir, aziz nagar, moinabad, Rajendra nagar, RangaReddy, Telangana, Crime

Panic gripped few villages around Himayatsagar on Sunday afternoon after some locals reportedly found pugmarks of a leopard on the outskirts of their settlement. However, forest officials are regularly visiting the area and keeping a vigil to prevent it from moving towards the city.

మైలార్దేవ్ పల్లిలో రెస్ట్.. హిమాయత్ సాగర్లో థస్ట్.. చిరుత ఎక్కడ..

Posted: 05/18/2020 11:36 AM IST
Leopard venturing on hyderabad outskirts evades forest authorities

తనకు ఎవరు ఎదురోచ్చినా.. తాను ఎవరికి ఎదురైనా ప్రత్యర్థులకే రిస్క్ అన్న బాలయ్య డైలాగ్ చెబుతూ.. నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుని స్థానికులను హడలెత్తించిన ఓ చిరుత.. ఓ లారీ డ్రైవర్ ను అటాక్ చేయబోయింది. చిరుతను చూసిన శునకాలు వెంటపడటంతో మనిషిని విడిచిపెట్టింది. ఆ తరువాత స్థానికంగా ఓ పంక్షన్ హాల్ లోకి పరుగుపెట్టింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బందికి దానిని పట్టుకునే ప్రయత్నం చేసినా.. అది చిక్కకుండా పారిపోతోంది. లాక్ డౌన్ తో రోడ్లు ఖాళీగా వుందని ఆదమరచి రోడ్డుపైనే నిద్రించిన చిరుత.. వైలార్ దేవ్ పల్లి నుంచి మాయం కాగా, హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతూ కనిపించిందని అక్కడి జాలర్లు కొందరు సమాచారం అందించారు.

జాలర్ల సమాచారంతో ఆ ప్రాంతానికి వెళ్లి తీవ్రంగా చిరుత అచూకీ కోసం అన్వేషించిన అటవీ, పోలీసు శాఖ అధికారుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆచూకీ లభించింది ఇక పట్టేస్తామని భావించినా.. మీరు నన్న పట్టుకోలేరు అంటూ సవాల్ విసురుతూ పారిపోతోంది. మైలార్ దేవ్ పల్లిలో పాద ముద్రల ద్వారా చిరుత గోడ దూకి వెళ్లిందని నిర్థారించిన అధికారులు.. దానిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతుండగా చిరుతను చూసిన జాలర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు..  ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ చిరుత చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హై సెక్యూరిటీ కెమెరాలు, డ్రోన్లతో గాలించి, జంతువులను ఎరగా వేసినప్పటికీ చిరుత మాత్రం బయటకు రావడం లేదు. చిరుత చిక్కకపోవడంతో హిమాయత్‌సాగర్ పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోవైపు, చిరుత కోసం తీవ్రంగా వెతుకుతున్న అటవీ అధికారులు నిన్న హిమాయత్‌సాగర్ జలాశయం చుట్టుపక్కల గ్రామాలైన అజీజ్‌నగర్, కొత్వాలగూడ, కవ్వగూడ, మర్లగూడ పరిసరాల్లో గాలించారు. అయినప్పటికీ దాని జాడ కనిపించలేదు. ఏమైనా, చిరుతను బంధించే వరకు వెతుకుతూనే ఉంటామని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  himayath sagar  Reservoir  aziz nagar  moinabad  Rajendra nagar  RangaReddy  Telangana  Crime  

Other Articles